రూ.8 వేలతో ఎలా బతకాలి.. పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు
వచ్చే జీతం సరిపోకపోతే అప్పులు చేయాల్సి వస్తుంది కుటుంబం గడవడానికి .. కానీ చేసిన అప్పులు కూడా సమయానికి తీర్చకపోతే ఇంటి మీదకు వస్తారు. మరో మార్గం ఆలోచించాలి, మనీ సంపాదించాలి.. బతకడానికి బోలెడు అవకాశాలు ఉన్నాయి. సరైన మార్గాన్ని ఎంచుకుంటే సౌకర్యవంతంగా జీవించవచ్చు.
బీహార్ భాగల్‌పూర్‌లో నివసిస్తున్న కుమార్ కుటుంబం ఆనందంతో జీవిస్తున్నారు. ఆ కుటుంబంలో పెద్ద కొడుకు అమిత్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. COVID-19 మహమ్మారి కారణంగా రెండున్నర సంవత్సరాలుగా నిరుద్యోగిగా ఉన్న తర్వాత, అమిత్ కుమార్ ప్రభుత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా ఉద్యోగంలో చేరారు. అయితే అది పార్ట్‌టైమ్ ఉద్యోగం. జీతం కూడా రూ. 8,౦౦౦ మాత్రమే.
పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుడిగా ఉన్నప్పటికీ, అమిత్ పూర్తి సమయం పనిచేశాడు. పిల్లలను క్రీడలలో పాల్గొనేందుకు ప్రోత్సహించేవాడు.. ఆ విధంగా శిక్షణ ఇచ్చేవాడు. అయితే అదే పాఠశాలలో “రెండున్నరేళ్లు పని చేసిన తర్వాత కూడా జీతం పెరగలేదు. ప్రభుత్వం అర్హత పరీక్షను కూడా నిర్వహించడం లేదు. స్కూల్‌లోని ఇతర ఉపాధ్యాయులు ₹ 42,000 జీతం తీసుకుంటారు , తాను పొందే దానికంటే ఐదు రెట్లు ఎక్కువ. అమిత్ మరియు ఇతర పార్ట్ టైమ్ ఉపాధ్యాయులకు ఈ సంవత్సరం ప్రారంభంలో నాలుగు నెలలు జీతాలు లేవు. దీంతో స్నేహితుల వద్ద అప్పు చేయాల్సి వచ్చింది. అప్పు మొత్తం పెరిగిపోతోంది. అది తీర్చే మార్గం కనిపించడం లేదు.
తన భార్య సలహాను అనుసరించి, ఫుడ్ డెలివరీ యాప్ అయిన Zomatoలో ఫుడ్ డెలివరీ వ్యక్తిగా నమోదు చేసుకోవాలని అమిత్ నిర్ణయించుకున్నాడు. అతను ఇలా అంటాడు, “నేను ఫుడ్ డెలివరీ వ్యక్తిగా పని చేయడం గురించి పరిశోధించాను, నిర్దిష్ట పని గంటలు లేవని గుర్తించాను. నా పేరు నమోదు చేసుకుని పని ప్రారంభించాను. ఇప్పుడు, నేను ఉదయం పిల్లలకు ఆటలలో శిక్షణ ిస్తాను. సాయంత్రం 5 నుండి పుడ్ డెలివరీ చేసే రెండవ పనిని చేస్తాను.
అంతకుముందు అమిత్ కోవిడ్-19 మహమ్మారి తన ఉద్యోగాన్ని తీసివేసే వరకు ప్రైవేట్ పాఠశాలలో పని చేసేవాడు. 2019లో, అతను ప్రభుత్వ పరీక్షకు హాజరయ్యాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2022లో అతడికి ప్రభుత్వ పాఠశాలలో పార్ట్ టైమ్ ఉద్యోగం వచ్చింది. జీతం తక్కువ అయినా పని చేయాలని నిర్ణయించుకున్నాడు.
“ చేతిలో ₹ 8,000 ఉండడంతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను. నాకు తల్లి కూడా ఉంది. ఆమెను చూసుకోవాలి, నా భార్యా పిల్లలను చూసుకోవాలి, అందుకే నేను రెండు ఉద్యోగాలు చేయవలసి వస్తుంది”, అని అతను చెప్పాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com