Gwalior: జూనియర్ డాక్టర్‌పై సహోద్యోగి అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

ఆర్జీకర్ ఘటన మరువకముందే మరో డాక్టర్ పై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో 25 ఏళ్ల జూనియర్ డాక్టర్‌పై ఆమె సహోద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
నిందితుడు కూడా 25 సంవత్సరాల వయస్సు గలవాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
బాధితురాలు పరీక్షకు హాజరయ్యేందుకు ప్రిపేర్ అవుతోంది. ఇందుకోసం గజరాజా మెడికల్ కాలేజీలోని బాలికల హాస్టల్‌లో ఉంటోందని సిటీ సూపరింటెండెంట్ అశోక్ జాడాన్ తెలిపారు. నిందితుడు, బాధితురాలితో కలిసి చదువుకునేందుకు ఆమెను పాత బాలుర హాస్టల్‌లో కలవడానికి పిలిచాడు. ఆమె అక్కడకు చేరుకోగానే నిందితుడు ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని అధికారి తెలిపారు.
అనంతరం బాధితురాలు ఇక్కడి క్యాంపు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి సంబంధిత చట్టపరమైన నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోందని వారు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com