భార్య కోసం నగలు కొన్నాడు.. రూ.8.45 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు..

భార్య కోసం నగలు కొన్నాడు.. రూ.8.45 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు..
X
భారతదేశంలోని సింగపూర్ హైకమిషన్ బాలసుబ్రమణియన్ లాటరీని గెలుచుకున్న తర్వాత అభినందన సందేశాన్ని పోస్ట్ చేశారు.

సింగపూర్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి గత ఆదివారం (నవంబర్ 24) లక్కీ డ్రాలో 1 మిలియన్ డాలర్ల (రూ. 8.45 కోట్లు) గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకుని ఓవర్‌నైట్ మిలియనీర్ అయ్యారు. బాలసుబ్రమణ్యం అనే వ్యక్తి మూడు నెలల క్రితం ఒక దుకాణంలో తన భార్య కోసం బంగారు గొలుసును కొనుగోలు చేశాడు. అక్కడ దుకాణం వారు కొన్ని కూపన్ లు ఇస్తే వాటిని పూర్తి చేసి డబ్బాలో వేశాడు. ఆ తరువాత ఆ విషయం మర్చిపోయారు. అయితే మూడు నెలల తరువాత దుకాణదారులు బాలసుబ్రమణ్యం కు ఫోన్ చేసి మీకు లాటరీ తగిలింది మొదటి బహుమతిని గెలుచుకున్నారు అని చెప్పారు. దాంతో అతడికి నోట మాట రాలేదు.. ఇది నిజమా కలా అని ఒక్క క్షణం ఆశ్చర్యానికి గురయ్యాడు.

ముస్తఫా జ్యువెలరీ యాజమాన్యం విజేత వార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది బాలసుబ్రమణ్యంను ఆశ్చర్యపరిచింది.

లక్కీ డ్రాలో పాల్గొనేందుకు అర్హత , వినియోగదారులు ఆభరణాలపై రూ.15,786 కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. బాలసుబ్రమణ్యందుకాణానికి వెళ్లిన సమయంలో తన భార్య కోసం రూ. 3.7 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేశాడు.

“ఈరోజు మా నాన్నగారి నాల్గవ వర్ధంతి కూడా. ఇది ఒక ఆశీర్వాదం,” అని బహుమతిని గెలుచుకున్న తర్వాత చిదబరం చెప్పాడు, కృతజ్ఞతగా డబ్బులో కొంత భాగాన్ని సమాజానికి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు.

బాలసుబ్రమణ్యం గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న వార్త భారతదేశంలోని సింగపూర్ హైకమిషన్‌కు కూడా చేరింది. దాంతో వారు కూడా అతనికి అభినందన సందేశాన్ని పోస్ట్ చేశారు.

"సింగపూర్‌లోని ఐకానిక్ ముస్తఫా సెంటర్ @mustafacentresgలో షాపింగ్ చేస్తూ US$1 మిలియన్ (8.5 కోట్ల రూపాయలు) లక్కీ డ్రాను గెలుచుకున్నందుకు శ్రీ బాలసుబ్రమణియన్‌కు అభినందనలు అని X లో పోస్ట్ చేశారు.


Tags

Next Story