Hyderabad: పెళ్లి చేసుకున్నాడు.. అదే రోజు ప్రాణం తీశాడు..

Hyderabad: పెళ్లి చేసుకున్నాడు.. అదే రోజు ప్రాణం తీశాడు..
X
పెళ్లి రోజునే 22 ఏళ్ల యువకుడు తన భార్యను హత్య చేసిన షాకింగ్ సంఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది.

వారిద్దరికీ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఆమె అతడిని పెళ్లి చేసుకోమని కోరింది. కానీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అతడికి.. దాంతో పెళ్లి చేసుకున్న రోజు సాయంత్రమే ఆమె ప్రాణాలు తీశాడు.

నిందితుడు విఘ్నేష్ నెల రోజుల క్రితం ఒక యువతికి ప్రపోజ్ చేశాడు. ఇద్దరూ కలిసి ఇల్లు అద్దెకు తీసుకుని కలిసి జీవిస్తున్నారు. అయితే, విఘ్నేష్ ఒక యువతితో కలిసి జీవిస్తూనే ఫోన్‌లో మరొక యువతితో సంభాషణలు జరుపుతున్నాడు. దీంతో అతడితో కలిసి జీవిస్తున్న యువతికి అనుమానవచ్చింది. ఫోన్ లో యువతితో మాటలు ఆపమని కోరింది. అయినా విఘ్నేష్ వినిపించుకోలేదు. దీంతో ఇద్దరి మద్యా గొడవలు తలెత్తాయి. ఆమె పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో వారి విభేదాలు తీవ్రమయ్యాయి, ఇలాగే గొడవ చేస్తే చంపేస్తానని కూడా కలిసి జీవిస్తున్న యువతిని బెదిరించాడు.

విఘ్నేష్ తన తల్లిదండ్రులకు సమాచారం అందించిన తర్వాత వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసినప్పటికీ, ఆమె పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టింది. దాంతో అతడు ఆమెను మట్టుపెట్టేందుకు ప్రణాళిక వేశాడు.

హైదరాబాద్‌లో పెళ్లి రోజున హత్యకు ప్లాన్‌ వేసినట్లు ఆరోపణలు వచ్చాయి

విఘ్నేష్ తన స్నేహితుడైన సాకేత్ అతడి భార్య కళ్యాణితో కలిసి ఆమెను చంపాలనే ప్లాన్‌ను పంచుకున్నాడు. అయితే, ఇద్దరూ అతనికి సహాయం చేయడానికి నిరాకరించారు. అధైర్యపడని విఘ్నేష్, ఆమె మరణం ప్రమాదవశాత్తూ సంభవించిందని, ఎవరికీ అనుమానం రాకుండా చేయాలనే లక్ష్యంతో, పెళ్లి తర్వాత ఆమెను అంతమొందించేందుకు కొత్త ప్లాన్ రూపొందించాడు.

నవంబర్ 8న బాలాపూర్‌లో విఘ్నేష్, సాకేత్ పెళ్లి దండలు, మంగళసూత్రం కొనుగోలు చేశారు. వారు వారి వివాహాన్ని ఘనంగా నిర్వహించారు, ఆ తర్వాత విఘ్నేష్ తన భార్యను వారి పెళ్లి గురించి తల్లికి తెలియజేయమని కోరడంతో ఆమె తన తల్లికి చెప్పింది తాను పెళ్లి చేసుకున్న విషయం.

విషాదకరమైన చర్య

అదేరోజు సాయంత్రం సాకేత్ పనికి వెళ్లగా, కళ్యాణి కిరాణా సామాన్లు కొనేందుకు బయటకు దుకాణానికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన విఘ్నేష్ తన భార్యపై దాడికి పాల్పడ్డాడు. అతను ఆమె తలను గోడకేసి కొట్టాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, చీరతో గొంతు పిసికి చంపాడు.

కళ్యాణి తిరిగి రాగానే మృతదేహాన్ని గుర్తించి భర్తకు సమాచారం అందించింది. విఘ్నేష్ మృతదేహాన్ని తుక్కుగూడలో పారవేసేందుకు దంపతులు సహకరించినట్లు సమాచారం. వారు ఇంటికి తిరిగి వచ్చే ముందు మృతదేహాన్ని చిత్తు కాగితాలతో కప్పారు.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

Tags

Next Story