బాబోయ్ బెంగళూరు.. అద్దె రూ.40 వేలు, అడ్వాన్స్ రూ.5 లక్షలు.. ఎక్స్‌లో మహిళ పోస్ట్
రూ.40,000 అద్దె ఉన్న ఫ్లాట్ కోసం రూ.5 లక్షల డిపాజిట్ చెల్లించాలని ఇంటి యజమాని తనను కోరాడని ఓ మహిళ పేర్కొంది. రూ. 40,000 అద్దెతో కూడిన ఫ్లాట్ కోసం రూ. 5 లక్షల డిపాజిట్ చెల్లించాలని ఇంటి యజమాని ఆమెను డిమాండ్ చేయడంతో బెంగళూరులో అద్దెకు ఇల్లు దొరకడమే కష్టమనుకుంటే, అంతకు మించి అద్దెలు, అడ్వాన్సులు ఉంటాయని సోషల్ మీడియాలో తన నిరాశను పంచుకుంది.
హర్నిద్ కౌర్ తన అద్దె ఇంటి కష్టాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె పోస్ట్ భారతదేశంలోని సిలికాన్ వ్యాలీలో పెరుగుతున్న అద్దె ధరలపై చర్చను ప్రారంభించింది. ఢిల్లీ వంటి ఇతర నగరాలతో (బెంగళూరు మెట్రో నగరం కూడా కాదు) పోలికలకు దారితీసింది. కొంతమంది వినియోగదారులు కౌర్ అద్దె కోసం ఇంత భారీ డిపాజిట్ చెల్లించడం కంటే ఇంటిని కొనుగోలు చేయడం మంచిదని సూచించారు.
మరికొందరు సంవత్సరానికి మొత్తం కట్టే అద్దె కంటే రూ. 5 లక్షల డిపాజిట్ చాలా ఎక్కువ అని అన్నారు. "40 వేల అద్దె, 5 లక్షల డిపాజిట్" అని కౌర్ ఎక్స్‌లో రాశారు. నగరంలో అద్దె ఫ్లాట్‌ల కోసం, అదీ తక్కువలో దొరుకుతుందేమో అని వెతికి వెతికి "అలసిపోయానని" ఆమె నిరుత్సాహం వ్యక్తం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com