Hyderabad: ఈ నెంబర్ల నుంచి ఫోన్ వస్తే లిప్ట్ చేయవద్దు.. సైబర్ క్రైం పోలీసుల హెచ్చరిక

Hyderabad: ఈ నెంబర్ల నుంచి ఫోన్ వస్తే లిప్ట్ చేయవద్దు.. సైబర్ క్రైం పోలీసుల హెచ్చరిక
X
టెక్నాలజీని దొంగలు తమకు వరంగా మార్చుకున్నారు.. చడీ చప్పుడు కాకుండా అకౌంట్లో నుంచి డబ్బులు మాయం చేస్తారు.. వాళ్లను పట్టుకోవడం కూడా అంత త్వరగా సాధ్యం కాదు.. పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తే తప్ప సైబర్ క్రై నేరస్థులను అరెస్ట్ చేయడం రిస్క్ తో కూడుకున్న పనిగానే చెప్పవచ్చు.

తెలిసిన నెంబర్ల నుంచి కొన్ని ఫోన్లు వస్తే, ఈ మధ్య తెలియని వాళ్ల నుంచి స్పామ్ కాల్ అంటూ మరి కొన్ని నెంబర్లు వస్తున్నాయి. పొరపాటును లిప్ట్ చేశారంటే అంతే సంగతులు అంటున్నారు సైబర్ క్రైం పోలీసులు. వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని వారి అకౌంట్ ను ఖాళీ చేస్తున్నారు నిందితులు. అందుకే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.

అమాయకులను బురిడీ కొట్టించడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ముఖ్యంగా సెల్‌ఫోన్లకు మెసేజులు పంపించడం, కాల్స్ చేయడం ద్వారా అమాయకుల బ్యాంకు ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను క్షణాల్లో కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తరహాలోనే ఇటీవల కొన్ని విదేశీ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.

ఆ నంబర్లు ఇవే..

అపరిచితుల నుంచి +56322553736, +37052529259, +94777 455913, +37127913091, +255901130460 నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయవద్దని పోలీసులు సూచించారు. ముఖ్యంగా +381 (సెర్బియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +371 (లాత్వియా), +375 (బెలారస్‌), +255 (టాంజానియా) వంటి కోడ్‌ నంబర్లతో ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఆ నెంబర్ కనుక లిఫ్ట్ చేస్తే కేవలం 3 సెకన్లలోనే ఫోన్‌లోని కాంటాక్ట్ లిస్ట్, బ్యాంక్, క్రెడిట్‌ కార్డుతో పాటు ఇతర వివరాలను కేవలం 3 సెకన్లలో కాపీ చేసుకునే ప్రమాదం పొంచి ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇక అపరిచిత వ్యక్తులు కాల్ మాట్లాడుతూ హ్యాష్ 90 లేదా హ్యాష్ 09 నంబర్లను ప్రెస్ చేయాలని కోరితే నొక్కవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. పొరపాటున ఈ కోడ్‌లను ఎంటర్ చేస్తే యూజర్ సిమ్‌ కార్డు యాక్సెస్‌ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని అప్రమత్తం చేశారు. ఈ విధంగా చేస్తే సదరు సిమ్ వినియోగదారుడిని నేరస్థుడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించే అవకాశం ఉంటుందని, అంతేకాకుండా బాధిత యూజర్ల ఛార్జీలతో నేరగాళ్లు ఫోన్‌కాల్స్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అందుకే తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తే తొందరపడవద్దు. అసలు లిప్ట్ చేయద్దు.

Tags

Next Story