Hyderabad: అతివేగంతో KBR పార్క్ కాంపౌండ్ గ్రిల్‌ను ఢీకొట్టిన పోర్స్చే

Hyderabad: అతివేగంతో KBR పార్క్ కాంపౌండ్ గ్రిల్‌ను ఢీకొట్టిన పోర్స్చే
X
పార్క్ సమీపంలో ఈ సంఘటన జరగడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు వాకర్స్. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

అతివేగం ప్రమాదమని తెలిసినా స్టీరింగ్ మీద పట్టుకోల్పోతున్నారు వాహనదారులు.. ఫలితంగా ఒక్కోసారి మితిమీరిన వేగం ప్రాణాల మీదకు కూడా తీసుకు వస్తుంటుంది. నగరంలోని కేబీఆర్‌ పార్క్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, పోర్షే కారు డ్రైవర్ పార్క్ సమీపంలో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. ఆగడానికి ముందు కాంపౌండ్ గ్రిల్‌ను ఢీకొన్నాడు. నేషనల్ పార్క్ సమీపంలో ఈ ఘటన పాదచారులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Tags

Next Story