35 ఏళ్లుగా ఎన్నికల్లో ప్రచారం చేశాను.. తొలిసారి నా కోసం: ప్రియాంక గాంధీ

35 ఏళ్లుగా ఎన్నికల్లో ప్రచారం చేశాను.. తొలిసారి నా కోసం: ప్రియాంక గాంధీ
X
ప్రియాంక గాంధీ వాద్రా వాయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేశారు.

తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ వేదికపై ఉండగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ తాను 35 సంవత్సరాలుగా ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, అయితే తనకు మద్దతు కోరడం ఇదే మొదటిసారి అని అన్నారు.

కేరళలోని వాయనాడ్‌లో పార్లమెంట్‌ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు నామినేషన్‌ దాఖలు చేయడానికి ముందు ఆమె బహిరంగ సభలో ప్రసంగించారు. వయనాడ్ సీటుకు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించి విజయం సాధించారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. దాంతో వాయనాడ్‌ సీటును వదులుకున్నారు. ఎన్నికల బరిలోకి తన సోదరిని ప్రవేశ పెట్టేందుకు రాహుల్ మార్గం సుగమం చేసారు.

"నేను మా నాన్న (మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ) కోసం ప్రచారం చేసినప్పుడు నాకు 17 ఏళ్లు. ఆ తర్వాత నేను మా అమ్మ, నా సోదరుడు, ఆ తరువాత పార్టీ తరపున పోటీ చేసిన వివిధ అభ్యర్ధుల కోసం ప్రచారం చేశాను. 35 సంవత్సరాలుగా నేను వేర్వేరు ఎన్నికలలో ప్రచారం చేస్తున్నాను, అయితే నేను ఇదే మొదటిసారి నా కోసం నేను ప్రచారం చేసుకోవడం. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం నాకు చాలా భిన్నమైన అనుభూతిని కలిగిస్తోంది. "మీరు నాకు అవకాశం ఇస్తే మీ తరపున ప్రాతినిధ్యం వహించడం నా గౌరవంగా భావిస్తాను అని ప్రియాంక తన మొదటి ప్రసంగంలో పేర్కొన్నారు."

కొండచరియలు విరిగిపడి 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. వేలాది మంది నిరాశ్రయులయిన తర్వాత వాయనాడ్‌లోని ముండక్కై, చురల్‌మలలను తాను, రాహుల్ గాంధీ సందర్శించామని శ్రీమతి గాంధీ వాద్రా చెప్పారు.

నేను ఈ విధ్వంసాన్ని నా కళ్లతో చూశాను. వారి కుటుంబాలను కోల్పోయిన పిల్లలను నేను చూశాను. వారి పిల్లలను కోల్పోయిన తల్లులను నేను కలుసుకున్నాను. వారి జీవితమంతా కష్టపడి సంపాదించినదంతా కళ్లముందే కొట్టుకుపోయిన వ్యక్తులను నేను కలుసుకున్నాను. ఒకరికొకరు సహాయం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. అత్యాశ లేకుండా ఒకరికొకరు మద్దతుగా నిలిచారు.

వాయనాడ్ తన కోసం ఏం చేసిందో మాటల్లో చెప్పలేమని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. "వాయనాడ్‌ లోక్‌సభలో అధికారిక ఎంపీ మరియు అనధికారిక ఎంపీ ఉంటారు. వారిద్దరూ మీ సమస్యలను లేవనెత్తుతారు" అని ఆయన అన్నారు

Tags

Next Story