భారత్ vs ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్ టికెట్ల కోసం తొక్కిసలాట.. వాటర్ గన్స్ ప్రయోగించిన పోలీసులు

భారత్ vs ఇంగ్లాండ్ కటక్ వన్డే మ్యాచ్ కోసం బారాబతి స్టేడియం దగ్గర టికెట్లు విక్రయిస్తున్నారని తెలిసి అభిమానులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు వారిని అదుపు చేయడం కష్టంగా మారింది. దాంతో వాటర్ గన్స్ ప్రయోగించాల్సి వచ్చింది.
ఫిబ్రవరి 9న జరిగే రెండో వన్డేలో భారత్, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ చూడటానికి వేలాది మంది అభిమానులు ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోసం ఎగబడుతుండగా కటక్‌లోని క్రికెట్ స్టేడియం వెలుపల మొత్తం గందరగోళం నెలకొంది. క్రికెట్ ప్రియులు చాలా మంది స్పృహ కోల్పోగా, మరికొందరు కిక్కిరిసిన టికెట్ కౌంటర్ల మధ్య నిలబడటానికి ఇబ్బంది పడ్డారు. జనాన్ని చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ గన్‌లను ఉపయోగించాల్సి వచ్చింది.
టిక్కెట్ల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించడంలో ఒడిశా క్రికెట్ అసోసియేషన్ విఫలమైందని అనేక స్థానిక మీడియా విమర్శించింది.
ఆగ్రహంతో ఉన్న స్థానికులు అధికారులను సరైన ఏర్పాట్లు లేకపోవడంపై నిందించారు. నిరాశ చెందిన అభిమానులు తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడంపై తప్పు పట్టారు. ఎగ్జిట్ మార్గాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది.
మంగళవారం రాత్రి వేలాది మంది క్రికెట్ ఔత్సాహికులు తమ టిక్కెట్లను పొందడానికి స్టేడియం దగ్గర గుమిగూడారు. బుధవారం తెల్లవారేసరికి పొడవైన క్యూ లైన్లు ఏర్పడ్డాయి, కొంతమంది అభిమానులు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మతో సహా తమ అభిమాన క్రికెటర్లను చూసే అవకాశాన్ని మిస్ అవకూ రాత్రంతా బయట గడిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com