ట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయి 22 ఏళ్ల తర్వాత పాక్ నుంచి ముంబైకి..

ట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయి 22 ఏళ్ల తర్వాత పాక్ నుంచి ముంబైకి..
X
ఎప్పటికైనా భారత్‌కు తిరిగి వస్తానని ఆశ తనకు ఉండేదని, అది ఈ రోజు కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆ మహిళ తెలిపింది.

ఆర్ధిక పరిస్థితులు అంతంత మాత్రం.. కుటుంబాన్ని నడిపేందుకు విదేశాల్లో పనిమనుషులుగా మారేందుకు సిద్ధపడుతుంటారు కొందరు మహిళలు. వారి అవసరాన్ని అవకాశంగా తీసుకుని ట్రావెల్ ఏజెంట్లు పని ఇప్పిస్తామని ఆశ చూపుతుంటారు. ఎందరో మహిళలు తమ కుటుంబాలకు దూరంగా దుర్భర జీవితాలను గడుపుతుంటారు. వెళ్లినంత ఈజీగా తిరిగి రావడానికి ఉండదు. దాంతో వారు ఏదో ఒకరోజు తమ వారిని కలుస్తామన్న ఆశతో బతుకుతుంటారు.

ట్రావెల్ ఏజెంట్ మోసపూరితం కారణంగా పాకిస్తాన్‌లో గత 22 సంవత్సరాలుగా నివసిస్తున్న భారతీయ మహిళ సోమవారం లాహోర్‌లోని వాఘా సరిహద్దు మీదుగా తన స్వదేశానికి తిరిగి వచ్చింది.

ముంబైకి చెందిన హమీదా బానో, 2002లో పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌కు వచ్చారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ మోసం చేసి, పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్ జిల్లాకు తీసుకొచ్చాడు.

“సోమవారం ఆమె కరాచీ నుండి విమానంలో ఇక్కడికి చేరుకుంది. బానో తన కుటుంబంతో మళ్లీ కలుస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా భారత్‌కు తిరిగి వస్తానని ఆశ కోల్పోయానని, అయితే ఈ రోజును చూడటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది.

2022లో, ఒక రిక్రూట్‌మెంట్ ఏజెంట్ ఆమెకు దుబాయ్‌లో కుక్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో హమీదా బానో 2002లో భారతదేశాన్ని విడిచిపెట్టింది. అక్కడి నుంచి ఆమెను మోసగించి పాకిస్తాన్‌కు రవాణా చేశారు. స్థానిక యూట్యూబర్ వలీవుల్లా మరూఫ్ తో బానో తన కష్టాలను పంచుకున్నారు. మరూఫ్ యొక్క వ్లాగ్ ఆమెకు భారతదేశంలోని తన కుటుంబంతో కనెక్ట్ కావడానికి సహాయపడింది. ఆమె కుమార్తె యాస్మీన్‌తోనూ ఫోన్‌లో మాట్లాడింది. దోహా, ఖతార్, దుబాయ్, సౌదీ అరేబియా దేశాల్లో వంట మనిషిగా పని చేసినట్లు తెలిపింది.

ఆమె పాకిస్తాన్‌లో ఉన్న 22 సంవత్సరాల సమయంలో కరాచీకి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. అతను కోవిడ్ -19 తో మరణించాడు. అప్పటి నుంచి ఆమె తన సవతి కొడుకుతో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది.

Tags

Next Story