IRCTC: ప్రయాణికులకు ముఖ్య గమనిక..

ట్రైన్ టికెట్ బుకింగ్ కోసం అందరూ ఆధారపడేది ఐఆర్ సీటీసీ వెబ్ సైట్. అయితే సాంకేతిక సమస్య కారణంగా ట్రైన్ టికెట్స్ బుకింగ్ కు బ్రేక్ పడింది. సమస్యకు పరిష్కారం కోసం తమ టెక్నికల్ టీం పని చేస్తోందని ఐఆర్ సీటీసీ తన ట్విటర్ అకౌంట్ లో ప్రకటించింది.
రైల్వే టికెట్ల కోసం ఎక్కువమంది ఆశ్రయించే యాప్ ఐఆర్ సీటీసీ. అయితే ఉదయం నుంచి ఈ అకౌంట్లోకి ఎవరు లాగిన్ అయినా టికెట్స్ బుక్ అవ్వలేదు సరికదా అమేజాన్, మేక్ మై ట్రిప్ తదితర థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోమని రికమెండేషన్ వస్తుందటతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై అధికారిక యంత్రాంగం తక్షణమే స్పందించింది. సాంకేతిక సమస్యల కారణంగా టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోయాయని అధికారులు ప్రకటించారు. సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు తమ ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి అమేజాన్, మేక్ మై ట్రిప్ తదితర థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన వెంటనే తెలియజేస్తామని ట్వీట్ లో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోవడంతో ఐఆర్ సీటీసీ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. మరోవైపు, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా టికెట్ బుకింగ్ సాధ్యం కావడంలేదంటున్న నెటిజన్లు సమస్యను తొందరగా సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com