
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రయ్యాడు. అతడి భార్య ఆతియా శెట్టి సోమవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను రాహుల్, ఆతియా జంట సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వీరికి అభిమానులు, సినీ ప్రముఖులు,క్రికెటర్ల నుంచి భారీ స్థాయిలో అభినందనలు వెలువెత్తాయి. రాహుల్, ఆతియా జంటకు సోషల్ మీడియాలో అందరూ శుభకాంక్షలు తెలుపుతున్నారు. రాహుల్ భారత క్రికెటర్కాగా.. ఆతియా శెట్టి ప్రముఖ బాలీవుడ్ హీరో సునిల్ శెట్టి కూతురు. వీరిద్దరూ 2023లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఈ జంటకు పండంటి పాప పుట్టింది. ఇక ఐపీఎల్-2025 సీజన్లో కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆతియా ప్రసవానికి సిద్ధంగా ఉండటంతో రాహుల్ సోమవారం ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com