West Bengal: రూ. 4 లక్షలకు 21 నెలల చిన్నారి విక్రయం

West Bengal: రూ. 4 లక్షలకు 21 నెలల చిన్నారి విక్రయం

కోల్‌కతాలో దారుణం జరిగింది. 21 రోజుల వయసనున్న అభం శుభం తెలియని ఓ పసిగుడ్డును ఓ మహిళ కేవలం 4 లక్షలకు విక్రయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు బిడ్డను కొన్న మహిళ ఇంటి నంచి పాపను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితురాలితో పాటు ఘటనలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

ఇంటి పక్కన మహిళ ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. రైల్ కాలనీలోని నోనాదంగాలో నివాసం ఉండే నిందితురాలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో చేసిన పనిని ఒప్పుకున్నారు.తీవ్రంగా దర్యాప్తు చేసిన పోలీసులు చివరికి పాపను కొన్న వారిని మిడ్నాపూర్‌కి చెందినక కళ్యాణి గుహగా గుర్తించారు. సదరు మహిళకు పెళ్లై 15 సంత్రాలైనా సంతానం కలగలేదని గుర్తించారు. పాపను అదుపులోకి తీసుకుని చిన్నారుల రక్షణా కేంద్రానికి అప్పగించారు.

నిందితులపై వివిధ సెక్షన్లు 317, 370, 372,120B కింద కేసులు నమోదు చేశారు. అలాగే జువైనల్ జస్టిస్ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.

ఇటువంటి ఘటనే ఇటీవల వెస్ట్‌బెంగాల్‌లో మరోట నమోదైంది. ఇన్‌స్టాగ్రాం రీల్స్ చేసుకోవడానికి IPhone-14 కొనడానికి 8 నెలల తన కుమారుడిని అమ్మకానికి పెట్టడం విస్మయానికి గురిచేసింది.


Tags

Next Story