లాస్ ఏంజిల్స్ అగ్నిప్రమాదం.. అంధ కుమారుడుని కోల్పోయిన ఆస్ట్రేలియా మహిళ

లాస్ ఏంజిల్స్ అగ్నిప్రమాదం.. అంధ కుమారుడుని కోల్పోయిన ఆస్ట్రేలియా మహిళ
X
భయానక దృశ్యాలను వివరించిన తల్లి, సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న తన కొడుకు అంధుడు కూడా అని, బిడ్డను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించానని అయినా రక్షించుకోలేకపోయానని కన్నీరు మున్నీరవుతోంది.

లాస్ ఏంజిల్స్ అడవి మంటలు ఇంకా చల్లారలేదు. ప్రాణాలు పోతున్నాయి. వేల ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. అంధుడైన తన కొడుకును కోల్పోయిన ఓ తల్లి కుమిలిపోతోంది. పక్షవాతంతో బాధపడుతున్న తన 32 ఏళ్ల కుమారుడు రోరీని రక్షించేందుకు తీవ్ర పోరాటం చేశానని టీవీ ప్రొడక్షన్ వ్యవస్థాపకురాలు షెల్లీ సైక్స్ ఆస్ట్రేలియన్ మీడియాతో చెప్పారు.

లాస్ ఏంజిల్స్‌లో గాలితో కూడిన అడవి మంటలు కనీసం 24 మందిని పొట్టన పెట్టుకున్నాయి. లాస్ ఏంజిల్స్ కౌంటీలోని బీచ్‌సైడ్ సిటీ అయిన మాలిబులో 6.8 హెక్టార్ల (17 ఎకరాల) ఎస్టేట్‌లో తాను, తన కుమారుడు నివసిస్తున్నామని షెల్లీ తెలిపింది.

నడవలేడు అందువల్ల అతను బాత్రూమ్ నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడలేదు," అని సైక్స్ ఆస్ట్రేలియా యొక్క ఛానల్ నైన్‌తో అన్నారు. 'అమ్మా, నువ్వు వెళ్ళు, నేను ఉంటాను' అన్నాడు." అంతలోనే అతడు మంటల్లో ఆహుతి అయ్యాడు. నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను."

అతను కార్బన్ మోనాక్సైడ్ విషం కారణంగా మరణించాడని అగ్నిమాపక అధికారులు తెలిపారు. తన కుమారుడిని ప్రమాదం నుంచి గట్టెక్కించలేకపోయానని బాధిత తల్లి తెలిపింది.

"నాకు చేయి విరిగింది. నేను అతనిని ఎత్తలేకపోయాను. నేను అతనిని కదలించలేకపోయాను అని షెల్లీ కన్నీటితో


Tags

Next Story