Mahakumbh Monalisa: అందం తెచ్చిన చిక్కులు.. వేధిస్తున్న పురుషులు

మహాకుంభ్ సందర్భంగా ఇండోర్‌కు చెందిన మోనాలిసా భోంస్లే, పూసల దండలు అమ్ముకుంటూ తన మానాన తాను బతుకుతోంది. కెమెరా కళ్లు ఆమె అందాన్ని క్యాప్చర్ చేశాయి. ఇంకేముంది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందరి కళ్లు ఆమె అందం మీదే.. దాంతో ఆమె తనను వేధించే మృగాళ్ల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.
ఆమె ఎర్రటి సల్వార్ ధరించి, చుట్టుపక్కల ఉన్న గుంపు నుండి పారిపోవడానికి ప్రయత్నించినట్లు చూపిస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఆమె కుటుంబ సభ్యులలో ఒకరు ఆమెను ఆకతాయిల నుంచి దూరంగా లాగడం కనిపిస్తుంది, మరికొందరు ఆమెను ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్న పురుషుల సమూహం నుండి ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె వారి నుంచి తప్పించుకుని దుపట్టాతో ముఖాన్ని కప్పుకున్న వీడియో వైరల్ అవుతోంది.
కొత్తగా వచ్చిన కీర్తి ఆమె వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ పరిస్థితి కారణంగా ఆమె తండ్రి ఆమెను ఇంటికి పంపించేయాలనుకుంటున్నట్లు సమాచారం.
"కుంభమేళాకు వచ్చిన అందరి కళ్లు మోనాలిసా పైనే ఉన్నాయి. దాంతో ఆమెకు దండలు అమ్మడం కష్టంగా మారింది. ప్రస్తుతానికి తాము ఇంటికి వెళ్లడమే మంచిదని మా నాన్న నిర్ణయించుకున్నారు" అని భోంస్లే చెల్లెలు విద్యా మీడియాతో అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com