Maharastra: అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. తృటిలో తప్పించుకున్న గర్భిణి

మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఒక గర్భిణీ స్త్రీ మరియు ఆమె కుటుంబ సభ్యులు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అంబులెన్స్ ఇంజిన్‌లో మంటలు వ్యాపించి నిమిషాల వ్యవధిలో అందులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ కు మంటలు అంటుకుని అది పేలింది. పేలుడు ధాటికి సమీపంలోని కొన్ని ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి.
అంబులెన్స్ డ్రైవర్ ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గమనించాడు. వెంటనే వాహనం నుంచి దిగి అందులో ప్రయాణిస్తున్న గర్భిణీ స్త్రీని, ఆమె కుటుంబ సభ్యులను కూడా వాహనం దిగమని కోరాడు. అందరూ దిగిన తర్వాత అంబులెన్స్ ఇంజిన్‌లో మంటలు మరింత తీవ్రంగా చెలరేగాయి. కొన్ని నిమిషాల తర్వాత వాహనంలోని ఆక్సిజన్ సిలిండర్ పేలింది. గర్భిణీ స్త్రీని ఆమె కుటుంబ సభ్యులు ఎరండోల్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి జలగావ్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళుతుండగా దాదా వాడి ప్రాంతంలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై ఈ సంఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com