Minor Rape Incident: మైనర్ బాలికపై గుడి పెద్దల పైశాచికం..

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. 12 యేళ్ల మైనర్ బాలికపై ఓ గుడి పెద్దలు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతే కాదు తన ప్రైవేట్ భాగాల్లో బలమైన వస్తువులతో తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర రక్తస్రావంతో బాలిక ఇప్పుడు రేవాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని మైహర్ పట్టణంలో చోటు చేసుకుంది. నిందితులపై పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందుతులు రవిచంద్ర కుమార్, అతుల్ భదోలియాలను అరెస్ట్ చేశారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాలికకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ పోలీసులను ఆదేశించారు.
మైహర్ అనే పట్టణంలో ప్రముఖ మాత శారద దేవీ మందిర్ ఆలయానికి సంబంధించిన వీరు, బాలికను మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. నిర్మాననుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు.
అయితే బాలిక పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘోర ఘటనపై పోలీసులు మాట్లాడుతూ బాలిక శరీరంపై గాయాలపై నిర్ధారణ పూర్తి మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే తెలుస్తందన్నారు. బాలిక శరీరంలో లైంగిక వేధింపులకు సంబంధించిన గాయాలు ఉన్నట్లు నిర్ధారించారు.
"12 యేళ్ల బాలిక శరీరంలోకి కర్ర వంటి వస్తువులతో గారపరిచారన్న వాదనలను ఖండించడంలేదు. కానీ దీనిపై మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే నిర్ధారణకు వస్తాము. తనకు రక్తస్రావం అవుతోంది. బాలిక పరిస్థితిని వైద్యులు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు " అని సాత్నా ఎస్పీ అశుతోష్ గుప్తా వెల్లడించారు.
30 యేళ్ల వయసున్న ఇద్దరు నిందులను అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడీసియల్ కస్టడీ విధించింది.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ఇద్దరు నిందితులను గుడి తరపున బాధ్యతల నుంచి తొలగించినట్లు శారదా దేవీ మందిర్ కమిటీ ప్రకటించింది. వీరు గుడికి చెడ్డ పేరుని తీసుకువచ్చారంది.
मैहर में छोटी बच्ची के साथ दुष्कर्म की घटना अत्यंत निंदनीय है। बच्ची के साथ निर्भया कांड की तरह अमानवीय व्यवहार किये जाने की बात भी सामने आ रही है। प्रदेश में आए दिन बच्चियों के साथ अत्याचार की घटनाओं ने साबित कर दिया है कि शिवराज सरकार बहन-बेटियों को सुरक्षा देने में पूरी तरह…
— Kamal Nath (@OfficeOfKNath) July 28, 2023
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చౌహాన్ హయాంలో రేప్ ఘటనలు నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నాడు. బాలికకు మెరుగైన వైద్యం అందించి, 1 కోటి రూపాయల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com