ఒకే పోలికలతో ఎంపీ శశిథరూర్, షోయబ్ అక్తర్.. ట్విట్టర్‌లో రెస్పాన్స్ ఇదే

ఒకే పోలికలతో ఎంపీ శశిథరూర్, షోయబ్ అక్తర్.. ట్విట్టర్‌లో రెస్పాన్స్ ఇదే

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్‌ అక్తర్‌తో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు. విమానాశ్రయంలో ఢిల్లీ కనెక్టింగ్ విమానం కోసం ఎదురుచూస్తుండగా, షోయబ్ అక్తర్ కనబడటంతో, ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకుని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అక్టర్‌ను ప్రశంసిస్తూ, తమ మధ్య జరిగిన సంభాషణను పంచుకున్నాడు.

శశిథరూర్ ట్విట్టర్‌లో రాస్తూ.. దుబాయ్‌ నుంచి ఢిల్లీ వస్తుండగా షోయబ్ అక్తర్ హలో అని పలకరించడంతో నేను ఆశ్చర్యానికి గురయ్యాను. తెలివైన, ప్రత్యర్థుల్ని భయపట్టే ఈ ఫాస్ట్ బౌలర్‌కి సరిహద్దు అవతల కూడా చాలా మంది అభిమానులు ఉన్నారన్నాడు. నన్ను పలకరించడానికి వచ్చిన అభిమానులు, అక్తర్‌తో కూడా సెల్ఫీలు దిగారన్నాడు. భారత్-పాక్ జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లపై చర్చించామన్నాడు.


అయితే ఈ చిత్రాన్ని ట్విట్లర్ వినియోగదారులు మరో కోణంలో చూశారు. ఇద్దరిలో కొన్ని పోలికలు ఒకేలా ఉండటాన్ని గమనిస్తూ తమకు నచ్చినట్లుగా కామెంట్లు చేశారు.

"నా కళ్లను నేను చెక్‌ చేయించుకోవాలి. ఒక్కరే ఇద్దరిలా కనబడుతున్నారు" అని ఒక యూజర్ అన్నారు.


"వారిద్దరివీ దేశాలు వేరైనా, ఒకే హెయిర్ స్టైల్‌తో కలిసిపోయారు" అంటూ మరో యూజర్ రిప్లై ఇచ్చాడు.

"నాకు ఇద్దరు షోయబ్ అక్తర్‌లు కనబడుతున్నారు" అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.



ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే శశిథరూర్ తన ట్వీట్లలో సరికొత్త ఇంగ్లీష్ పదాలను ఉపయోగిస్తూ ఫాలోవర్లు డిక్షనరీలో ఆ పదాల్ని వెతికేలా చేస్తుంటాడు.



Tags

Next Story