Delhi: మార్కెట్‌లోకి నందిని పాలు.. అమూల్, మదర్ డెయిరీకి గట్టి పోటీ

నందిని పాల ఉత్పత్తులు తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్రలలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఒక ప్రయోగంగా న్యూఢిల్లీకి కూడా తమ ఉత్పత్తులను రవాణా చేస్తోంది.
కర్ణాటకకు చెందిన నందిని పాలు నవంబర్ 21న ఢిల్లీ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయని బుధవారం నివేదికలు సూచించాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ బ్రాండ్‌ను నగరంలో ప్రారంభించనున్నారు. నందిని పాలు ఢిల్లీ మార్కెట్‌లోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. ఈ విషయమై కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ ఎంకే జగదీష్ మాట్లాడుతూ నవంబర్ 21 నుంచి న్యూఢిల్లీ అంతటా నందిని పాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని, నవంబర్ 26 నుంచి కర్ణాటకలో దోస, ఇడ్లీ పిండిని కూడా ఈ బ్రాండ్ పరిచయం చేస్తుందని తెలిపారు.
దేశ రాజధానిలో ప్రారంభించిన తర్వాత, నందిని పాలు న్యూ ఢిల్లీలో అత్యధిక మార్కెట్ వాటాను కలిగి ఉన్న అమూల్, మదర్ డైరీ వంటి ఇతర ఉత్పత్తులతో పోటీపడతాయి.
మరో ముఖ్య విషయం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)లో క్రికెట్ T20 ప్రపంచ కప్ సందర్భంగా నందిని మిల్క్, పాలవిరుగుడు ఆధారిత శక్తి పానీయమైన 'నందిని స్ప్లాష్'తో యునైటెడ్ స్టేట్స్‌లోని ఎనర్జీ-డ్రింక్ మార్కెట్‌లోకి ప్రవేశించింది.
అంతేకాదు, క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ క్రికెట్ జట్లకు నందిని స్పాన్సర్ చేసింది. స్వదేశీ బ్రాండ్ తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు స్పాన్సర్ చేసింది.
బెంగళూరులో పెరుగు విక్రయాలను అమూల్ ప్రకటించిన తర్వాత కర్ణాటకలో అప్పటి బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకలో నందినిని అమూల్ ఎప్పటికీ భర్తీ చేయదని, అయితే రెండు బ్రాండ్‌లు సహజీవనం చేస్తాయని బసవరాజ్ బొమ్మై తరువాత స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com