Nara Lokesh: మంగళగిరిలో నారా లోకేశ్ ఘన విజయం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మంగళగిరిలో విజయఢంకా మోగించారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి లావణ్యపై గెలిచారు. దీంతో టీడీపీ దశాబ్ధాలుగా గెలవని మంగళగిరి అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ జెండా ఎగరేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచింది. 1985లో చివరిగా గెలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకూ అక్కడ గెలవలేదు. ఇక 2019లో లోకేశ్ పోటీ చేసి ఓడినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండటం ఇప్పుడు ఆయనకు కలిసొచ్చింది. అలాగే నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయనపై ప్రజల్లో సానుకూలతను పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించే దిశగా పరుగులు తీస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com