బీహార్ ఎంపీకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు

బీహార్‌లోని పూర్నియాకు చెందిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపు వచ్చినట్లు సమాచారం. నటుడు సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన వివాదం నుంచి దూరంగా ఉండమని చేసిన హెచ్చరికలను పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చంపేస్తానని బెదిరిస్తూ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలు జారీ చేసింది.
జైలు సిగ్నల్ జామర్‌లను డిసేబుల్ చేయడానికి లారెన్స్ బిష్ణోయ్ గంటకు రూ. 1 లక్ష చెల్లిస్తున్నాడని తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ ఇటీవల ముంబైలో ఎన్‌సిపి నాయకుడు బాబా సిద్ధిక్ హత్య తర్వాత మరోసారి వెలుగులోకి వచ్చారు.
బెదిరింపుపై యాదవ్ బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)కి వెంటనే చర్య తీసుకోవాలని కోరారు. బాబా సిద్ధిఖ్ హత్యను ఖండిస్తూ, యాదవ్ దీనిని అవమానకరమైన చర్యగా పేర్కొన్నాడు. ప్రభుత్వ మద్దతు ఉన్న మాజీ మంత్రి హత్య మహారాష్ట్రలో " అన్యాయాన్ని" హైలైట్ చేసిందని X లో పేర్కొన్నాడు. “బీహార్ కుమారుడు బాబా సిద్ధిక్ హత్య అత్యంత విషాదకరం. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం తన ప్రభావవంతమైన నాయకులను రక్షించలేకపోతే, సాధారణ ప్రజలకు ప్రభుత్వం ఏం భరోసా ఇస్తుంది అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com