No Confidence Motion: ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం,అనుమతించిన స్పీకర్

No Confidence Motion: ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం,అనుమతించిన స్పీకర్
ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో "మణిపూర్, మణిపూర్‌" అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ ఘటనలపై హోం మంత్రి అమిత్‌ షా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కోనున్నారు. మణిపూర్‌ అల్లర్లు, అక్కడ జరుగుతున్న ఆకృత్యాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీలు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనను స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా అనుమతించారు. ఈ అంశంపై చర్చకు స్పీకర్ తేదీని ప్రకటించనున్నారు.

లోక్‌సభలో ప్రభుత్వానికి బలం లేదని నమ్మినపుడు, ప్రతిపక్షాలు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాయి. ఈ తీర్మానం సరిగ్గానే ఉందని స్పీకర్ భావించినపుడు దానిని సభకి చదివి వినిపిస్తాడు. అనంతరం తీర్మానానికి ఎంతమంది సభ్యులు మద్దతు తెలుపుతారో సభలో కోరతారు. మెజార్టీ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా మద్దతు తెలిపితే అవిశ్వాస తీర్మానం పాస్ అయినట్లుగా ప్రకటిస్తాడు. తర్వాత అవిశ్వాసం ఎదుర్కొన్న ప్రభుత్వం రద్దవుతుంది. ప్రధానితో సహా మంత్రి మండలి రాజీనామాలు చేయాల్సి ఉంటుంది.


కేంద్రప్రభుత్వంపై లోక్‌సభలో కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గగోయ్ లోక్‌సభ జనరల్ సెక్రెటరీకి నోటీసులు ఇవ్వగా, కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ఫ్లోర్‌ లీడర్, ఎంపీ నాగేశ్వర రావు స్పీకర్‌కు నోటీసులు అందజేశారు.

ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో "మణిపూర్, మణిపూర్‌" అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ ఘటనలపై హోం మంత్రి అమిత్‌ షా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇప్పుడు నినాదాలు చేస్తున్న నాయకులెవ్వరూ కూడా మణిపూర్‌ అంశంలో సహకరించడానికి ఆసక్తిగా లేరు. మహిళలు, దళితుల సంక్షేమంపై వారికి చిత్తశుద్ధి లేదు. ఏ అంశంపై అయినా సుదీర్ఘ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు.

మణిపూర్‌లో మే 4న జరిగిన మహిళ ఊరేగింపు ఘటనకు సంబంధించి ఓ వీడియో జులై 19న బయటకు రావడంతో మణిపూర్‌లో జరుగుతున్న ఆకృత్యాలను బయటి ప్రపంచానికి వెల్లడైంది.

జులై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ ఉభయ సభల్లో మణిపూర్ ఘటనలు, హింసపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడాలని విపక్షాలు పట్టుబడుతూ నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఉభయ సభలూ పలు మార్లు వాయిదాలు పడ్డాయి.

Tags

Read MoreRead Less
Next Story