'నో రొమాన్స్, ఇది ఓయో కాదు': ప్రయాణీకులకు ఆటో డ్రైవర్ స్ట్రాంగ్ వార్నింగ్

యువతను పాడు చేసే వస్తువులు ఏమైనా ఉన్నాయా అంటే ముందు వరుసలో నిలబడేవి సినిమాలు, మొబైల్స్. విచ్చలవిడి శృంగారం యువతను పెడదారి పట్టిస్తుంది. పబ్లిక్ ప్లేస్ లో ఏం చేయకూడదో అవే చేస్తున్నారు. చూసేవారు అసహ్యించుకునేలా చేస్తున్నారు. అదే ఆ ఆటో డ్రైవర్ హెచ్చరికకు కారణమైంది.
ఒక ఆటోరిక్షా డ్రైవర్ తన ప్రయాణీకుల కోసం విధించిన కఠినమైన నిబంధనలను రూపొందించాడు. ఒక వినియోగదారు దానిని ఫోటో తీసి Xలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. 23 ఏళ్ల వినియోగదారు అన్య షేర్ చేసిన ఫోటోలో కొన్ని నియమాలను జాబితా చేసింది.
మెసేజ్‌లో, డ్రైవర్ తన క్యాబ్‌లో “రొమాన్స్” గురించి హెచ్చరించాడు. ప్రయాణీకులను గౌరవంగా ఉండమని కోరాడు. "హెచ్చరిక!! ఇది క్యాబ్ మీ ప్రైవేట్ స్థలం లేదా OYO కాదు కాబట్టి దయచేసి డీసెంట్ గా బిహేవ్ చేయడం. గౌరవం ఇచ్చి పుచ్చుకుంటే మర్యాదగా ఉంటుంది.. ధన్యవాదాలు," అని రాసి ఉన్న బోర్డు వేలాడదీశాడు.
వేలకొద్దీ వీక్షణలు పొందిన పోస్ట్ లో నెటిజన్లు చాలా మంది అతని నిజాయితీని మెచ్చుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com