Pawan kalyan : పవన్ కల్యాణ్ కు అభినందనల వెల్లువ

Pawan kalyan : పవన్ కల్యాణ్ కు  అభినందనల వెల్లువ
X

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షించిన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమిని చవిచూసిన పవన్‌ ఈసారి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. తెలుగుదేశం, బీజేపీతో కలిసి పోటీ చేయడంతో పవన్‌ విజయం సునాయాసంగా సాగింది. తొలి రౌండ్‌ నుంచి పవన్‌ ఆధిక్యం కనబరుస్తూ ఆఖరికి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉండే పిఠాపురం నియోజకవర్గం నుంచి వ్యూహాత్మకంగా పవన్‌ కల్యాణ్‌ పోటీ చేశారు. సినీ రంగ ప్రముఖులతోపాటు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు భారీగా ప్రచారం చేశారు. తన ప్రత్యర్థి వంగా గీతపై పవన్‌ సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన కూటమి ప్రభంజనంలో పవర్‌ స్టార్‌ పిఠాపురాన్ని కైవసం చేసుకున్నారు. రౌండ్‌ రౌండ్‌కు తన ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ 70,384 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే వంగా గీతను గెలిపిస్తే హోంమంత్రి ఇస్తానని చెప్పినా కూడా పిఠాపురం వాసులు జగన్‌ను గెలిపించలేకపోయారు. .ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఓజి” మూవీ టీం పవన్ కల్యాణ్ ప్రభంజనంపై స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.”ఓజి” టైం మొదలైంది అంటూ సినిమాలోని పవన్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో పవన్ కుర్చీలో కూర్చున్న పోజ్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చింది.ప్రస్తుతం ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఎంతో సందడి చేస్తున్నారు.

Next Story