
మన ఫోన్‌లో బ్యాటరీ అయిపోయిన వెంటనే ఛార్జింగ్ పెడుతుంటాం.. అయితే కొన్ని సార్లు ఎంత సేపు ఛార్జింగ్ పెట్టినా ఫోన్ ఛార్జ్ అవ్వదు. అలాంటప్పుడు వెంటనే దాన్ని రిపేర్ చేయించడానికి తీసుకెళ్తాం.. అలాకాకుండా దాన్ని మీరే రిపేర్ చేసుకునేలా కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవి ఏంటో ఓ సారి చూద్దాం...
పోన్ ఎప్పుడైనా ఛార్జ్ కానట్లయితే మొదటగా చేయాల్సిన పని రీస్టార్ట్ చేయడం. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ఛార్జింగ్ కాకపోవడానికి కారణమైన సాప్ట్‌వేర్ లోపాలు అదుపులోకి వస్తాయి. అదేవిధంగా ఫోన్‌లోని ప్రధాన భాగాలన్ని రిఫ్రెష్ అవుతాయి. ఫోన్‌లోని కొన్ని యాప్‌లు కూడా ఛార్జింగ్ సమస్యలకు కారణం కావచ్చు. కావున ఇటీవల డౌన్‌లోడ్ చేసిన యాప్స్‌లో ఒకటి మీ ఛార్జింగ్ సమస్యలకు కారణం అవచ్చు ఏమో అనేది ఓసారి చూసుకోండి. దాని వల్ల సమస్యే అనిపిస్తే వెంటనే వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. అలాగే వాటిలో ఉపయోగించని యాప్‌లనూ కూడా డిలీట్ చేయాలి.
కొన్ని సార్లు ఛార్జర్ పిన్ బాగలేకపోవడం వల్ల కూడా ఛార్జ్ కాకపోవచ్చు. ఛార్జింగ్ పెట్టే సమయంలో కేబుల్‌లోని తీగ వదులుగా ఉండవచ్చు, అడాప్టర్‌లో కూడా లోపాలు ఉండవచ్చు. మనం ఉపయోగించే కేబుల్ మంచిదా కాదా అని తెలుసుకోవడానికి సులభమైన మార్గం ఫోన్‌ను యుఎస్‌బి ద్వారా డెస్క్ టాప్‌కు కనెక్ట్ చేయడం. ఒక వేళ మీ ఫోన్‌ను కంప్యూటర్ ఛార్జ్ చేస్తే, అడాప్టర్ లేదా సాకెట్‌లో సమస్య ఉన్నట్లుగా గుర్తించాలి.
మెుబైల్ ఛార్జ్ అవకపోవడానికి మరో సమస్య ఛార్జింగ్ పోర్ట్ వద్ద పేరుకుపోయిన ధూళి కణాలు విద్యుత్తు సరఫరా కాకుండా అడ్డు పడతాయి. కావున అక్కడ ఏమైనా దుమ్ము, ధూళి ఉంటే పొడిబట్టతో తుడువాలి. ఫోన్ లో నీరు చేరితే వెంటనే ఛార్జ్ చేయకూడదు. ముందు ఫోన్ లోపలి భాగాలు డ్రై అయ్యేలా చూసుకోవాలి. తడిసిపోయిన భాగాలను హెయిర్ డ్రయర్‌తో వేడి గాలిని పంపిస్తూ ఆరబెట్టాలి అలా చేసిన తర్వాత కనీసం ఒకరోజైనా ఛార్జ్ చేయకుండా ఉండాలి. ఇలా పోన్ ఛార్జ్ అవ్వకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కావున పై పరిష్కారాల ద్వారా ఛార్జీంగ్ సమస్యను అధిగమించవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com