ఫన్ బకెట్ పేరుతో వెకిలి వేషాలు.. తెలుగు యూట్యూబర్ కు 20 ఏళ్ల జైలు శిక్ష
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా అందరినీ శాసిస్తోంది. ఇక యూట్యూబ్ వీడియోలకు లెక్కేలేదు. ఒకదాన్ని మించి మరొకటి థంబ్ నెయిల్స్, వ్యూయర్ ని కట్టిపడేస్తుంటాయి. ఫన్ బకెట్ తో పేరు సంపాదించిన యూట్యూబర్ చిక్కుల్లో పడ్డాడు.. స్కిట్ లో భాగంగా పని చేస్తున్న యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో పోలీసులు అతడిని విచారించి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బాధితురాలికి రూ.4 లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
దాదాపు ప్రతి ఒక్కరూ తమను తాము యూట్యూబర్‌గా భావిస్తారు. చాలా మంది కంటెంట్ క్రియేటర్‌లు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్‌లు, కామెడీ స్కిట్‌లు చేయడం ద్వారా పాపులర్ అయ్యారు. వారిలో భార్గవ్ కూడా ఒకడు. 'ఫన్ బకెట్' వీడియోల ద్వారా అతడు ప్రసిద్ధి చెందాడు.
విశాఖపట్నంకు చెందిన భార్గవ్ కామిడీ టైమింగ్‌తో పెద్ద సంఖ్యలో ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. అయితే, తన వీడియోలలో తనతో నటించిన యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
విచారణ సందర్భంగా, భార్గవ్‌పై అభియోగాలను ధృవీకరించే కీలకమైన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత, భార్గవ్ బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కోర్టు నిర్ధారించింది. దీంతో కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వినోద పరిశ్రమలో భార్గవ్ కెరీర్‌కు ముగింపుగా పలు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com