Sexual Harassment: మహిళా డాక్టర్‌ని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్
Sexual Harassment: ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే విమానంలో 24 యేళ్ల మహిళా డాక్టర్‌ని ఓ ప్రొఫెసర్ లైంగికంగా వేధించాడు. ఈ ఆరోపణలతో సదరు ప్రొఫెసర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఫ్లైట్‌లో మహిళా డాక్టర్‌ని, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న 47 ఏళ్ల ప్రొఫెసర్ ఇద్దరూ పక్క పక్క సీట్లలో కూర్చున్నారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే సమయంలో ఆ ప్రొఫెసర్ తనని అసభ్యకరంగా తాకాడంటూ ఆ యువతి ఆరోపించింది. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వివాదం కూడా చోటుచేసుకుంది. గొడవ పెద్దది కావడంతో విమానంలో ఉన్న సిబ్బంది జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ఇరు వర్గాలు సహర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు.
"మహిళా డాక్టర్‌ని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయంలో అసభ్యకరంగా తాకినట్లు" మాకు ఫిర్యాదు అందింది అని పోలీస్ అధికారులు వెల్లడించారు.
యువతి ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి, అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరు పరిచారు. కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com