'రామాయణం' విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్..
ఎన్నో అంచనాల తర్వాత, రణబీర్ కపూర్ చిత్రం - రామాయణం విడుదల తేదీలు ప్రకటించబడ్డాయి. నిర్మాత నమిత్ మల్హోత్రా రామాయణం పార్ట్ 1 మరియు 2 విడుదల సంవత్సరాన్ని ప్రకటించారు. ఇది రెండు భాగాలుగా విడుదల కానున్న సినిమా అని ప్రేక్షకులకు ఒక హింట్ అయితే ఇచ్చారు. రామాయణం 1వ భాగం 2026లో విడుదలవుతుండగా, పార్ట్ 2 2027లో బిగ్ స్క్రీన్ పైకి రానుంది.
విడుదల తేదీలను పంచుకుంటూ, నమిత్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. “ఒక దశాబ్దం క్రితం, 5000 సంవత్సరాలకు పైగా కోట్లాది హృదయాలను పాలించిన ఈ ఇతిహాసాన్ని పెద్ద తెరపైకి తీసుకురావాలనే గొప్ప తపనను నేను ప్రారంభించాను.
ఈ రోజు, మా బృందాలు ఒకే ఒక ఉద్దేశ్యంతో అవిశ్రాంతంగా పని చేస్తున్నందున ఇది అందంగా రూపుదిద్దుకోవడం చూసి నేను సంతోషిస్తున్నాను: మన చరిత్ర, మన సత్యం, మన సంస్కృతి యొక్క అత్యంత ప్రామాణికమైన, పవిత్రమైన, దృశ్యపరంగా అద్భుతమైన అనుసరణను అందించడం - మన రామాయణం.
" మా కలను నెరవేర్చడానికి మాతో చేరండి... దీపావళి 2026లో పార్ట్ 1 మరియు దీపావళి 2027లో పార్ట్ 2 విడుదలవుతుందని తెలిపారు.
రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి నటిస్తుంది. మరో స్టార్ యష్ కూడా రావణ్ పాత్రలో నటించనున్నారు. కైకేయి పాత్రలో లారా దత్తా, హనుమంతుడిగా సన్నీ డియోల్ మరియు మంథర పాత్రలో షీబా చద్దా కనిపించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com