పాపకు అన్నీ నా పోలికలే: రామ్ చరణ్

పాపకు అన్నీ నా పోలికలే: రామ్ చరణ్
లిట్టిల్ మెగా ప్రిన్సెస్ గురించి తొలిసారి మాట్లాడిన రామ్ చరణ్
లిట్టిల్ మెగా ప్రిన్సెస్ ఇంటికి వెళ్లుతుండగా అభిమానులు పులకించిపోయారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తమ గారాల పట్టితో సహా మీడియాకు అభివాదం చేశారు. పాపాయిని ఎత్తుకుని జంటగా ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో తండ్రి హోదాలో మీడియాతో మాట్లాడిన రామ్ చరణ్.. పాపాయి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అందరిలానే ఓ తండ్రిగా తనకు ఓ పాప పుట్టడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. పాపకు తన పోలికలే వచ్చాయంటూ మురిసిపోయారు. ఇక లిట్టిల్ మెగా ప్రిన్సెస్ కు పేరు కూడా నిర్ణయించినట్లు తెలిపారు. ఉపసనా, తాను ఓ పేరు అనుకున్నామని వెల్లడించారు. సంప్రదాయం ప్రకారం 13వ రోజు కానీ, 21వ రోజు కానీ సరైన ముహూర్తం చూసి పాపాయికి నామకరణం చేయనున్నట్లు తెలిపారు. ఏమైనా గ్లోబల్ స్టార్ పుత్రికోత్సాహంతో ఉబ్బితబ్బిబైపోతున్నాడు అనడంలో సందేహమే లేదు.

Tags

Read MoreRead Less
Next Story