RGKar Rape and Murder Case: నిందితుడు సంజయ్ రాయ్‌కి జీవిత ఖైదు..

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో డ్యూటీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు. ఈ మధ్యాహ్నం కోల్‌కతాలోని స్థానిక కోర్టులో శిక్షను ప్రకటించే సమయంలో, కోల్‌కతా పోలీస్‌లో మాజీ పౌర వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ , తాను "నేరం చేయలేదు" అని చెప్పాడు.
ఈ కేసును విచారిస్తున్న సిబిఐ, ఇది "అరుదైన" కేటగిరీ కిందకు వస్తుందని, "సమాజంపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడానికి" రాయ్‌కి మరణశిక్ష విధించాలని పేర్కొంది.
అయితే సీల్దా కోర్టు అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్, ఈ కేసు అరుదైన కేటగిరీ కిందకు రాదని, అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నట్లు తెలిపారు. బాధితురాలి కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
31 ఏళ్ల వైద్యుడి పాక్షిక నగ్న మృతదేహం గత ఏడాది ఆగస్టు 9న ప్రభుత్వ ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లోని మూడవ అంతస్తులో కనుగొనబడింది. మరుసటి రోజు నిందితుడిగా అనుమనించి రాయ్‌ని అరెస్టు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com