పదేళ్లలో 3 వివాహాలు, 1.25 కోట్లు వసూలు.. ధనవంతులైన పురుషులు ఆమె టార్గెట్..

పదేళ్లలో 3 వివాహాలు, 1.25 కోట్లు వసూలు.. ధనవంతులైన పురుషులు ఆమె టార్గెట్..
X
బతకడానికి బోలెడు మార్గాలున్నా కష్టపడకుండా ఈజీగా మనీ సంపాదించాలని కోరుకుంటారు కొందరు.. కానీ అది ఎంతో కాలం సాగదు.. ఎప్పుడో ఒకప్పుడు పట్టుబడక తప్పదు..

ఒక మహిళ ఒక దశాబ్దం పాటు వరుసగా వివాహాలు చేసుకుని, సెటిల్‌మెంట్ పేరుతో వారి నుండి మొత్తం రూ. 1.25 కోట్లు వసూలు చేసి పోలీసులకు పట్టుబడింది.

ఉత్తరాఖండ్ నివాసి అయిన సీమా అలియాస్ నిక్కీ 2013లో ఆగ్రాకు చెందిన వ్యాపారవేత్తను మొదట వివాహం చేసుకుంది. కొంత కాలం తర్వాత, ఆ వ్యక్తి కుటుంబంపై కేసు పెట్టి రాజీ రూపంలో ₹ 75 లక్షలు అందుకుంది.

2017లో, గురుగ్రామ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని వివాహం చేసుకుంది. అతని నుంచి కూడా విడిపోయి సెటిల్‌మెంట్‌గా ఆ వ్యక్తి నుండి ₹ 10 లక్షలు తీసుకుంది. అనంతరం ఆమె 2023లో జైపూర్‌కు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. అయితే పెళ్లైన కొద్ది రోజులకే ₹ 36 లక్షల విలువైన నగలు మరియు నగదుతో అతని ఇంటి నుండి పారిపోయింది. కుటుంబ సభ్యులు కేసు నమోదు చేయడంతో జైపూర్ పోలీసులు సీమాను అరెస్ట్ చేశారు.

సీమా వివాహం చేసుకోవడం కోసం మ్యాట్రిమోనియల్ సైట్‌లలో వెతుకుతుందని, సాధారణంగా విడాకులు తీసుకున్న లేదా భార్యలను కోల్పోయిన పురుషుల కోసం తన అన్వేషణ కొనసాగిస్తుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకోవడం ద్వారా వివిధ కేసుల్లో సెటిల్‌మెంట్‌గా మొత్తం ₹ 1.25 కోట్లు వసూలు చేసిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Tags

Next Story