లారెన్స్ బిష్ణోయ్ హిట్‌లిస్ట్‌లో శ్రద్ధా వాకర్ హత్య నిందితుడు..

లారెన్స్ బిష్ణోయ్ హిట్‌లిస్ట్‌లో శ్రద్ధా వాకర్ హత్య నిందితుడు..
X
బాబా సిద్ధిక్ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్ గౌతమ్, శ్రద్ధా వాకర్ హత్య నిందితుడు అఫ్తాబ్ పూనావాలా గురించి షాకింగ్ విషయం వెల్లడించాడు.

ఎన్‌సిపి నాయకుడు బాబా సిద్ధిక్ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్ గౌతమ్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో అతడు మరొక షాకింగ్ న్యూస్ వెల్లడించాడు. శ్రద్ధా వాకర్ హత్య నిందితుడు అఫ్తాబ్ పూనావాలాని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసిందని శివకుమార్ తెలిపాడు.

బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు శుభమ్ లోంకర్ పూనావాలాపై దాడి చేసే విషయమై చర్చించినట్లు వెల్లడించాడు. అయితే, పూనావాలా భద్రతను పెంచడంతో ఈ ఆలోచన విరమించుకున్నట్లు పేర్కొన్నాడు.

ప్రస్తుతం పూనావాలా ఉన్న తీహార్ జైలు నిర్వాహకులు నిందితులకు భద్రతను పెంచారు. మే 2022లో, అఫ్తాబ్ పూనావాలా తన లివ్-ఇన్ భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను ఢిల్లీలోని వారి ఫ్లాట్‌లో గొంతు కోసి చంపాడు. అతను ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచాడు. తరువాత వాటిని 18 రోజుల పాటు దేశ రాజధానిలోని వివిధ ప్రదేశాలలో పారవేసాడు.

శ్రద్దా వాకర్ ఇంట్లో వాళ్లు పూనావాలాతో సంబంధాన్ని అంగీకరించలేదు. దాంతో ఈ జంట ముంబై నుండి ఢిల్లీకి మకాం మార్చి మెహ్రౌలీ ప్రాంతంలో నివసించారు. కొన్నాళ్ల వరకు బాగానే అనంతరం ఇద్దరి మధ్యా గొడవలు చోటు చేసుకోవడంతో పూనావాలా అత్యంత కిరాతకంగా శ్రద్దా వాకర్ ను హతమార్చాడు.


Tags

Next Story