డైరీ ఉత్పత్తుల యూనిట్‌పై ఎస్‌ఓటీ దాడులు.. 600 కిలోల కల్తీ పనీర్ స్వాధీనం

కల్తీరాయుళ్లు తమను కట్టడి చేసేవాళ్లు ఎవరూ లేరనుకుంటారు. అక్రమ సంపాదనకు అదే ఆధారంగా భావిస్తుంటారు. కానీ ఏదో ఒక రోజు పట్టుబడితే ఊచలు లెక్కించాల్సి వస్తుందన్న ఇంగితజ్ఞానం ఇసుమంతైనా ఉండదు.
పాలు కల్తీ, నీళ్లు కల్తీ, తినే పదార్ధాలు, తాగే పదార్థాలు అన్నీ కల్తీ. అసలే రోజుకో కొత్త వైరస్ భయపెడుతుంటే ఇలాంటి కల్తీ పదార్ధాలు తింటే ఇంకా త్వరగా అనారోగ్యం పాలవుతుంటారు. తాము చేస్తున్నది తప్పు పని అని కించిత్ కూడా ఆలోచన కూడా లేకుండా ఉంటారు కల్తీ రాయుళ్లు. అక్రమ సంపాదనే ధ్యేయంగా బతుకుతుంటారు. ఆ విధంగా సంపాదించే తింటే అది ఎలా వంటబడుతుందో వారికే తెలియాలి. నీతి, న్యాయం అన్నీ చచ్చిపోతున్నాయి మనిషిలో. ఎంతసేపు ఈ రోజు గడిచిందా లేదా.. రేపటి గురించి ఆలోచించేవాళ్లు లేరు. అందుకే ఈ కల్తీ రాయుళ్లు గల్లీకి ఒకళ్లు పుట్టుకొస్తున్నారు.
అల్వాల్‌లో డైరీ ఉత్పత్తుల కల్తీ జరుగుతుందని సమాచారం అందడంతో యూనిట్‌పై సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) స్థానిక పోలీసులతో కలిసి దాడి చేసింది. ఈ దాడిలో వారికి 600 కిలోల కల్తీ పనీర్ తయారు చేసినట్లు తెలుసుకున్నారు. దానిలో కలిపే వివిధ రసాయనాలను, కల్తీ పనీర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఎస్‌ఓటీ, అల్వాల్ పోలీసులు శుక్రవారం రాత్రి రెసిడెన్షియల్ కాలనీలో నిర్వహిస్తున్న యూనిట్‌పై దాడి చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న యజమాని బేగంబజార్‌లోని తెలిసిన డీలర్ల నుంచి పాలు, ఇతర రసాయనాలను సేకరించి కల్తీ పనీర్ తయారీకి వినియోగించాడు.
పనీర్ స్థానిక విక్రేతలకు మరియు నగరంలోని పాత ప్రాంతాల్లోని కొన్ని ఫుడ్ జాయింట్‌లకు విక్రయించబడింది. యూనిట్‌ను సీజ్ చేసి యజమానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com