Music-Maths: లెక్కలు రావాలంటే సంగీతం నేర్చుకోవాల్సిందే..!
ఇంట్లో పిల్లలు చదువుకునేటప్పడు టీవీ పెడితే తల్లిదండ్రులు మందలించడం మనం తరచుగా చూస్తుంటాం. అయితే పరిశోధనలు మాత్రం సంగీతంతో పాటు చదివితే పిల్లలు గణితంలో మెరుగ్గా రాణించగలరని వెల్లడిస్తున్నాయి. రెండింటినీ కలిపి భోదిస్తే గణితంపై విద్యార్థులకు ఉండే ఆందోళనలను తగ్గించవచ్చంటున్నారు పరిశోధకులు.
దాదాపు 50 సంవత్సరాల పరిశోధనలను కలిపి పరిశీలించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
సంగీతంతో అభ్యసించడం ద్వారా గణితాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చి, విద్యార్థులను ఏకాగ్రతగా ఉంచడానికి తోడ్పడుతోందని వెల్లడైంది. గణితంపై ఉండే ఆందోళనలను తగ్గించగలదని తెలిపింది. వారిలో నేర్చుకోవాలనే ప్రేరణ కల్పించడమే కాకుండా, దానిపై మక్కువ పెంచేలా చేయగలదని అధ్యయనాలు తెలుపుతున్నాయి. సంగీతం, గణితాలలో పట్టు సాధించడానికి గుర్తులు, సమరూపత వంటి ఒకే రకమైన విధానాలు తోడ్పతాయన్నారు. విషయాన్ని సమగ్రంగా అర్థంచేసుకోవడం, తార్కిక నైపుణ్యం వంటివి అలవడతాయన్నారు.
సంగీతంలో రాణించే పిల్లలు గణితంలో కూడా మెరుగ్గా రాణిస్తారని పరిశోధనలో తేలింది. కానీ యువకులకు సంగీతం నేర్పించడం వల్ల వారి గణితశాస్త్రం మెరుగుపడుతుందా అనేది వెల్లడికాలేదు.
ఈ అంశంపై మరింత లోతుగా తెలుసుకోవానికి, టర్కిష్ పరిశోధకులు డాక్టర్ అయ్కా అకిన్, 1975-2022 మధ్య అకడమిక్ డేటాబేస్‌లను శోధించారు.
ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న 55 అధ్యయనాల ఫలితాలను కలిసి క్రోడీకరించింది. ఇందులో దాదాపు 78,000 మంది స్కూల్‌కి వెళ్లే పసిపిల్లల నుండి విశ్వవిద్యాలయ విద్యార్థుల వివరాలున్నాయి.
విద్యార్థులకు సంగీతం నేర్చుకోవడానికముందు, తర్వాత పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాల్ని పోల్చిచూశారు. సంగీతాన్ని గణిత తరగతుల్లో భాగంగా బోధించినా, ప్రత్యేక తరగతులుగా బోధించినా ఫలితాలు మెరుగ్గా ఉన్నాయిని తేలింది. సంగీతం లేకుండా పరీక్షలు రాసిన వారితో పోలిస్తే సంగీతంతో పాటుగా చదివిన విద్యార్థులు 73 శాతం మెరుగ్గా రాణించారని తేలింది. పరికరాలు వాయించడం తెలిసిన 63 శాతం విద్యార్థులు, సాధారణ సంగీత తరగతులకు హాజరైన 59 శాతం విద్యార్థులు, సాధారణ విద్యార్థుల కంటే మంచిగా రాణించారు అని పరిశోధనలో వెల్లడైంది.
సంగీతం ద్వారా అంకగణితం బోధించడానికి బాగా ఉపయోగపడుతున్నట్లు తేలింది. గణితంలోని భిన్నాలు, నిష్పత్తులు వంటి ప్రధాన అంశాలు కూడా సంగీతానికి ప్రాథమికమైనవటువంటిగా గుర్తించారు. ఉదాహరణకు, వేర్వేరు కొలతల్లో ఉండే సంగీత నోట్‌లను గణితంలోని భిన్నాలతో సూచించవచ్చు. సంగీత బార్‌లను రూపొందించడానికి వాటిని జోడించవచ్చు.
గణితాన్ని సంగీతంతో జోడించడం ద్వారా ప్రభావం ఎక్కుగా ఉండనున్నాయి. వాటి మధ్య అనుసంధానం ఏర్పరిచి గణిత శాస్త్రాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి, లోతుగా విశ్లేషించడానికి సహాయపడుతుందన్నారు. పాఠాలు సాంప్రదాయ గణిత పాఠాల కంటే మరింత ఆనందదాయకంగా ఉంటే, విద్యార్థులు గణితంపై ఎలాంటి ఆందోళనలైనా దూరం చేసుకోవచ్చన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com