Super Police : ప్రజలకు దగ్గరవుతున్న ఫ్రెండ్లీ పోలీస్...

Super Police : ప్రజలకు దగ్గరవుతున్న ఫ్రెండ్లీ పోలీస్...
X
భద్రతా- భరోసా ఫ్రెండ్లీ పోలీస్ నయా స్ట్రాటజీ... ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు చొరవ... సత్ఫలితాలను ఇస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్

ఒకప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్లాలంటే సామాన్యులు భయపడేవారు.. మారిన పరిస్థితులను బట్టి తమ సమస్యలను పోలీసు దృష్టికి తీసుకురావడానికి ఇప్పుడు వెనకాడడం లేదు. కొన్నేళ్లుగా పలుపురు పోలీసు అధికారులు తీసుకున్న నిర్ణయాలు, వాటి ఆచరణే ఈ మార్పుకు కారణం. ఇందులో ఒకటి ఫ్రెండ్లీ పోలీసింగ్.... కొంత కాలంగా పోలీసులు ప్రజలకు దగ్గర అయ్యేదుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి.


ఇంతకుముందు సమస్య వస్తే పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి ఆ స్టేషన్ ఇన్చార్జిగా ఉన్న అధికారి వచ్చేవరకు ఎదురు చూడాలి, ఫిర్యాదు ఇచ్చాక అది ఎఫ్ఐఆర్ అవుతుందో లేదో కూడా స్పష్టత ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ఫిర్యాదు చేస్తే చాలు ఎఫ్ ఐ ఆర్ నమోదు అవుతుంది. ఇంకా ఒక అడుగు ముందుకేసి పోలీస్ స్టేషన్ కు వెళ్లకపోయినా పోలీసులకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకొని ఫిర్యాదు చేస్తే అక్కడికక్కడే ఎఫ్.ఐ.ఆర్. కూడా నమోదైన సందర్భాలు ఉన్నాయి.


ఇంకొన్ని సందర్భాల్లో మా పరిధిలో జరగలేదు, ఆ ఏరియా మాకు రాదు అని తిప్పించకుండా నేరం తమ పోలీసు స్టేషన్ పరిధిలో జరగక పోయినా కంప్లైంట్ వస్తే చాలు జీరో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి సంబంధిత థానాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఫిర్యాదు ఏ రూపం లో వచ్చినా ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తున్నారు. పోయిన ఏడాది తెలంగాణ వ్యాప్తంగా డయల్ 100 కి 13 లక్షల 77,113 మంది ఫిర్యాదులు చేశారు. ఇక హ్యాక్ అయి ద్వారా 9684 ఫిర్యాదులు వచ్చాయి. షీ టీమ్స్ కి 6157 ఫిర్యాదులు వస్తే ప్రత్యక్షంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ లకు వచ్చి ఫిర్యాదు చేసిన వారి సంఖ్య 5,58, 524.


ఇలా తెలంగాణ వ్యాప్తంగా వివిధ రూపాల్లో వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి 142917 కేసులు నమోదు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్ పేరుతో పోలీసులు చేసిన ప్రయత్నంలో భాగంగా 15 లక్షల మంది ప్రజలు దగ్గరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పోలీసు విధుల పట్ల అవగాహన కల్పించేందుకు కళాబృందాల ద్వారా చేసిన ప్రయత్నం సుమారు నాలుగు లక్షల మంది ప్రజలకు పౌరులకు పోలీసులను దగ్గర అయ్యేలా చేసింది .సైబర్ నేరాల భారిన పడకుండా 15 లక్షలమంది పౌరులకు అవగాహన కల్పించారు పోలీసులు.


గత ఏడాదిలో హ్యాక్ ఐ ద్వారా 61674 ఫిర్యాదులు అందాయని ఫిర్యాదులు స్వీకరించడమే కాదు చర్యలు కూడా అంతే వేగంగా మొదలుపెడుతున్నాం అంటున్నారు పోలీసు అధికారులు. ఫిర్యాదు అందిన 7 నిమిషాల్లో తమ పోలీసు వాహనం ఘటనా స్థలికి చేరుకుంటుందంటున్నాయి పోలీసు రికార్డులు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న పోలీసులపై విమర్శలు లేకపోలేదు. నగర పరిధిలో ఉన్న ఫ్రెండ్లీ పోలీసింగ్ గ్రామీణ ప్రాంతాల్లో లేదనే అపవాదు ఉంది. అంతే కాదు కొన్ని సందర్భాల్లో ఒక ఫిర్యాదు చేయాలన్నా ఏఫ్.ఐ.ఆర్ నమోదు చేసేలా చూడాలన్నా ఎవరో ఒక అధికార పార్టీ నాయకుడిని ఆశ్రయించక తప్పని పరిస్థితి ఉందనే ఆరోపణ కూడా ఉంది. ఏది ఏమైనా మంచి ఉద్దేశ్యం తో మొదలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ నగరాలకే పరిమితం కాకుండా మారుమూల ప్రాంతాల్లో ఆచరిస్తే అందరికీ మంచిది.

Tags

Next Story