అర్థరాత్రి ఆసుపత్రిలో చేరిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌

అర్థరాత్రి ఆసుపత్రిలో చేరిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌
తమిళ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కార్డియాక్ ప్రొసీజర్ చేయించుకోవడానికి చెన్నై హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు.

తమిళ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ సెప్టెంబర్ 30 అర్థరాత్రి చెన్నై కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. క్యాథ్ ల్యాబ్‌లో ఆయన మెడికల్ టెస్టులు చేయించుకున్నారు. స్టెంట్‌ అమర్చిన తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

రెండు మూడు రోజులు ఆసుపత్రిలో ఉండే అవకాశం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ సూపర్ స్టార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అగ్ర నటుడి అభిమానులు చాలా మంది సోషల్ మీడియాలో వారి ప్రార్థనలు పంపారు, అతను త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. "జీర్ణ సంబంధిత సమస్యల కారణంగా ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Tags

Next Story