రాజమహేంద్రవరంలో మహానాడుకు భారీ ఏర్పాట్లు

రాజమహేంద్రవరంలో మహానాడుకు భారీ ఏర్పాట్లు
ఈ నెల 27, 28 వ తారీఖుల్లో జరగనున్న మహానాడు

రాజమండ్రి కేంద్రంగా ఈ నెల 27, 28 వ తారీఖుల్లో జరగనున్న మహానాడుకు భద్రతా ఏర్పాట్లు కల్పించాల్సిందిగా కోరుతూ డీజీపీకి, రవాణ ఏర్పాట్లు కొరకు ఆర్.టి.సి ఎండీకి తెదేపా నేత అచ్చెన్నాయుడు లేఖలు రాశారు. రాజమహేంద్రవరం, కడియం మండలంలోని వేమగిరి గ్రామంలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మహానాడుకు లక్షలాదిమంది ప్రజలు హాజరవ్వనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంచిత సంఘటనలు చోటుచేసుకోకుండా తగింత పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాయని కోరారు. సాధారణ ప్రజలకు ఎటువంటి ట్రాపిక్ ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజలు మహానాడుకు విచ్చేసేందుకు అద్దె బస్సులు ఏర్పాటు చేయాల్సిందింగా డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేయాలని ఆర్.టి.సి ఎండీని అచ్చెన్నాయుడు కోరారు.

Tags

Next Story