Telangana BJP : హైదరాబాద్ కు చేరుకున్న అమిత్ షా.. నోవాటెల్ లో మీటింగ్
శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు బీజేపీ అగ్రనేత అమిత్ షా. అక్కడి నుంచి నేరుగా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లకు వెళ్లాల్సిన ఆయన నోవాటెల్ హోటల్లో పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అనంతరం చేవెళ్లలో బీజేపీ తలపె ట్టిన విజయ సంకల్ప సభలో ప్రసంగిస్తారు. ఇప్పటికే బీజేపీ శ్రేణులు ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశాయి. ఎలాగైన తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని భావిస్తున్న బీజేపీ.. చేవేళ్ల సభపై చాలా అంచనాలు పెట్టుకుంది. అమిత్ షా కూడా బీఆర్ఎస్ టార్గెట్‌గా ప్రసంగం చేస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా నిరుద్యోగం, పేపర్ లీకేజీల అంశాలను లేవనెత్తి.. యువతను ఆకట్టుకునేలా ప్రసంగం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ నుంచి చేవెళ్ల వరకు దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చేవెళ్లను కాషాయమయంగా మార్చేశారు. కేడర్‌ను కూడా సమాయత్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ స్థానాల్లోని అన్ని గ్రామాల్లోకీ పార్టీని విస్తరించేలా ఈ మధ్యే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించింది. అలాగే.. అన్ని ఇళ్లకూ నాయకులు వెళ్లేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు రాబోతుండటంతో ఇప్పటి నుంచే ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమైంది. అందులో భాగాంగానే అమిత్ షా పర్యటనపై బీజేపీ అంచనాలు పెట్టుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com