ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టులో ఊరట.. బెయిలు మంజూరు

ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టులో ఊరట.. బెయిలు మంజూరు
వివేకా మర్డర్ కేసులో అవినాశ్ రెడ్డికి ఊరట, బెయిలు మంజూరు
ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. తెలంగాణా హైకోర్టు అవినాశ్ రెడ్డికి షరత్తులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది. సీబీఐ విచారణకు సహకరించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ప్రతి శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ సీబీఐ ఎందుట విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా దేశాన్ని విడిచి వెళ్లరాదని హై కోర్టు హెచ్చరించింది. మరోవైపు కీలక సాక్షి వాంగ్మూలాన్ని సీబీఐ సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించింది.

Tags

Next Story