JEEని క్లియర్ చేయలేదని మేడపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య..

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)లో ఉత్తీర్ణత సాధించడంలో విఫలమైన 17 ఏళ్ల బాలిక న్యూ ఢిల్లీలోని జామియా నగర్ ప్రాంతంలో నివాస భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు శనివారం తెలిపారు.
12వ తరగతి పూర్తి చేసి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న బాలిక.. శుక్రవారం షాహీన్‌బాగ్‌లోని ఓ భవనంలోని ఏడో అంతస్తు నుంచి దూకింది. 'నన్ను క్షమించండి, నేను చేయలేను, నేను జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు' అని ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరికింది.
"నిన్న, ఉదయం 11:25 గంటలకు, PS జామియా నగర్‌లో ఓఖ్లా మెయిన్ మార్కెట్‌లోని ఒక భవనంలోని 7వ అంతస్తు పైకప్పు నుండి దూకిన 17 ఏళ్ల బాలికకు సంబంధించిన PCR కాల్ వచ్చింది. ఆమె 12వ తరగతి ఉత్తీర్ణులయ్యాక JEEకి సిద్ధమవుతోంది. చదువు ఒత్తిడి, అంచనాలను అందుకోలేకపోవడమే కారణమంటూ ఆమె సూసైడ్ నోట్ రాసిందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
పరీక్షలో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకుంటానని బాలిక గతంలో తన తల్లికి తెలియజేసిందని పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి ప్రైవేట్ రంగంలో పనిచేస్తుండగా, ఆమె తల్లి గృహిణి.
బాలిక పైకప్పుపై నుంచి దూకుతున్న సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. భారతీయ నాగ్రిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 194 కింద విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com