ప్రమాద బాధితుడి నుండి బైక్‌ను దొంగిలించిన ముగ్గురు వ్యక్తులు.. కానీ కర్మ వారిని వెంటాడి

ప్రమాద బాధితుడి నుండి బైక్‌ను దొంగిలించిన ముగ్గురు వ్యక్తులు.. కానీ కర్మ వారిని వెంటాడి
X
ఢిల్లీలో జరిగిన ఓ షాకింగ్ ఘటనలో రోడ్డుపై రక్తమోడుతున్న ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు అర్థరాత్రి గుర్తించారు. సహాయం అందించడానికి బదులుగా, వారు అతని మోటర్‌బైక్‌ను దొంగిలించి పారిపోయారు. అతడి మరణానికి కారణమయ్యారు. కానీ కర్మ వారిని వెంటాడింది. వారికి కూడా యాక్సిడెంట్ అయ్యింది. ముగ్గురిలో ఒకరు కోమాలోకి వెళ్లిపోయారు.. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ సంఘటన జనవరి 11 రాత్రి, తెల్లవారుజామున 3:00 గంటల సమయంలో, మెహ్రౌలీ-గురుగ్రామ్ రోడ్‌లో జరిగింది. ఘిటోర్నిలో నివాసముంటున్న వికాస్‌ అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా ఘిటోర్ని సమీపంలో అదుపు తప్పి కిందపడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. అతను రోడ్డుపై గాయపడి పడి ఉండగా, ముగ్గురు వ్యక్తులు-ఉదయ్ కుమార్, టింకు మరియు పర్మ్బీర్-వెళ్లారు. బాధితుడికి సాయం చేయకుండా బైక్‌ను దొంగిలించి వెళ్లిపోయారు.

ఇంతలో దొంగలు దొంగిలించిన బైక్‌ను నడుపుతుండగా, వారికి ఎంబి రోడ్డులో యాక్సిడెంట్ అయ్యింది. ఫలితంగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఉదయ్ కుమార్ కోమాలోకి వెళ్లాడు. టింకూ, పరంబీర్‌ల పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు వైద్యులు.

పోలీసులు అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకుని నలుగురిని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. అక్కడికి చేరుకునేలోపే వికాస్ చనిపోయినట్లు ప్రకటించారు. ఉదయ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. తదుపరి విచారణ కోసం సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

వికాస్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, దొంగలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారని తెలిసింది. పోలీసులు తదుపరి విచారణను కొనసాగిస్తున్నారు.

Tags

Next Story