టీవీ నటుడు నితిన్ కుమార్ సింగ్ ఆత్మహత్య..

టీవీ నటుడు నితిన్ కుమార్ సింగ్ ఆత్మహత్య..
X
టెలివిజన్ నటుడు నితిన్ కుమార్ సత్యపాల్ సింగ్ డిప్రెషన్‌తో బాధపడుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

35 ఏళ్ల టెలివిజన్ నటుడు ముంబై పశ్చిమ శివారు గోరేగావ్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. నటుడు నితిన్ కుమార్ సత్యపాల్ సింగ్ బుధవారం యశోధమ్ ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడని ఒక అధికారి తెలిపారు. సింగ్ గత రెండేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారని, దానికి సంబంధించి చికిత్స పొందుతున్నాడని తెలుస్తోంది. టెలివిజన్ మరియు సినిమాల్లో పని దొరకక పోవడంతో మరింత కృంగిపోయినట్లు సమాచారం.

సింగ్ భార్య తమ కుమార్తెను పార్కుకు తీసుకెళ్లింది. తిరిగి వచ్చేసరికి ఫ్లాట్ లోపలి నుండి తాళం వేసి ఉంది. దాంతో కంగారు పడిన ఆమె ఇరుగుపొరుగు వారి సహాయం తీసుకుంది. వారు వచ్చి తలుపులు కొట్టినా లోపలి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దాంతో వారు తలుపులు పగుల గొట్టి ఫ్లాట్‌లోకి ప్రవేశించారు. తన భర్త ఉరి వేసుకుని ఉండడాన్ని ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించి అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కాని వైద్యులు అప్పటికే నితిన్ చనిపోయినట్లు ప్రకటించారు. ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసినట్లు ప అధికారి తెలిపారు.

Tags

Next Story