నడుస్తున్న ఓలా స్కూటర్‌లో మంటలు.. ప్రమాదం నుంచి తప్పించుకున్న ఇద్దరు విద్యార్ధులు

ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడాలంటే ప్రజల్లో వణుకు పుడుతోంది. ఏ టైమ్ లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. పొల్యూషన్ అరికట్టే క్రమంలో తీసుకువస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు ఇంకా ప్రజల మన్నను పొందలేకపోతున్నాయి. ముఖ్యంగా ఓలా విషయంలో వెనుకడుగు వేస్తున్నారు కస్టమర్లు. ఓలా యాజమాన్యం దీనిపై మరింత శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకతను తెలుపుతున్నాయి ఇటువంటి సంఘటనలు. వినియోగదారుడికి పూర్తి నమ్మకం కలిగించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఎంతైనా ఉంది. ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా చూసుకోవాలి.
కేరళలోని తిరువనంతపురంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంలో ఉండగా మంటలు చెలరేగడంతో భద్రతా ప్రమాణాలపై ఆందోళనలు నెలకొన్నాయి. ఇద్దరు విద్యార్థులు కాలేజీకి వెళ్తుండగా స్కూటర్ నుంచి పొగలు రావడంతో ఒక్కసారిగా బండి అక్కడ వదిలేసి పరుగు పెట్టారు. అదృష్టవశాత్తూ, వాహనం మంటల్లో చిక్కుకోకముందే వారు స్కూటర్ దిగగలిగారు.
అగ్నిమాపక వాహనం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పింది. అయితే స్కూటర్ పూర్తిగా మంటల్లో దగ్ధమైది. స్థానిక మీడియా నివేదికలు ఈ భయంకరమైన సంఘటనను హైలైట్ చేస్తున్నాయి, ఈ ప్రాంతంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల భద్రత గురించి చర్చలు జరుగుతున్నాయి. పెరుగుతున్న ఆందోళనలకు ప్రతిస్పందనగా, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) భావిష్ అగర్వాల్ నిర్వహిస్తున్న EV కంపెనీకి షో-కాజ్ నోటీసు జారీ చేసింది, నోటీసు అందుకున్న 15 రోజులలోపు సమాధానం ఇవ్వాలని కోరింది. ఈ ఘటనలో ఎటువంటి గాయాలు కానప్పటికీ, పరిస్థితి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులలో గణనీయమైన ఆందోళనను రేకెత్తించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com