యువతితో క్యాబ్‌ డ్రైవర్ అనుచిత ప్రవర్తన..

ubercar
uberక్యాబ్ డ్రైవర్లు మహిళా ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు దేశంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. తమ అనుచిత ప్రవర్తనతో ప్రజలు క్యాబ్ ఎక్కాలంటేనే భయపడేట్లు చేస్తున్నారు.

తాజాగా ఇటీవల బెంగళూరులో ఓ మహిళకు జరిగిన ఓ భయానక ఘటన మహిళా ప్రయాణికుల పట్ల క్యాబ్ డ్రైవర్లు అనుచితంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.

తాను ప్రయాణిస్తున్న ఉబెర్ క్యాబ్ డ్రైవర్ తాను చెప్పిన మార్గంలో పోనివ్వకుండా, మరో మార్గంలోకి వెళ్లేందుకు యత్నించడమే కాకుండా, తన ప్రైవేట్‌ భాగాలు చూయిస్తూ సదరు మహిళ బిత్తరపోయేలా అనుచితంగా వ్యవహరించాడు.

ఈ భయానక సంఘటనను యువతి లింక్డ్‌ఇన్‌ ప్లాట్‌ఫాంలో షేర్ చేసుకుంది. క్షణాల్లోనే ఆ పోస్ట్ వైరల్ అయింది.

ఇదీ జరిగిందీ...

బెంగళూరులోని బీటీఎం నుంచి జేపీ నగర్‌ వెళ్లడానికి ఉబెర్‌ కారుని బుక్‌ చేసుకుంది. క్యాబ్‌ను మ్యాప్‌లో చూయిస్తున్న మార్గంలో కాకుండా, మరో మార్గంలో తీసుకెళ్లాడు. సదరు డ్రైవర్ అనుమానాస్పద ప్రవర్తనతో క్యాబ్‌లోనే ఉబెర్‌ ప్రతినిధులకి ఫిర్యాదు చేసింది. దాని తర్వాతే మళ్లీ మ్యాప్‌ని ఫాలో అవుతూ వెళ్లాడు. ఈ పరిణామాలతో ఆందోళన చెందిన యువతి గమ్యస్థానం కన్నా మందే దిగిపోవాలని నిర్ణయించుకుని, డబ్బులు చెల్లించింది. ఆ సమయంలో తన ప్రైవేట్ భాగాలు చూయిస్తూ యువతిని భయాందోళనకు గురిచేశాడు. ఈ సంఘటనతో బిత్తరపోయిన యువతి సమీపంలోని జనసమూహంలోకి పారిపోయింది.

"ఆ సమయంలో, నేను వెంటనే డ్రైవర్ నుంచి పారిపోయాను, సమీపంలోని గుంపు భద్రతలో సాంత్వన పొందాను. షాక్, గందరగోళం నన్ను తినేసాయి, నా ఆలోచనలను సేకరించడం కష్టతరం చేసింది," అని ఆమె ఆ పోస్ట్‌లో రాసింది.

ఈ పోస్ట్‌ వైరల్ అవడంతో ఉబర్ సదరు క్యాబ్ డ్రైవర్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

"నిన్న జరిగిన సంఘటనపై అప్‌డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఉబెర్ ప్రతినిధుల బృందం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసింది. వారి వేగవంతమైన ప్రతిస్పందనకు, పరిస్థితిని పరిష్కరించడానికి వారు చేసిన ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలుపుతుపుతున్నాను. సదరు డ్రైవర్‌పై అవసరమైన చర్యలు తీసుకున్నారు." అని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story