Uttar Pradesh: గూగుల్ మ్యాప్ చూపిన దారిలో వెళ్లి ముగ్గురు మృతి

Uttar Pradesh: గూగుల్ మ్యాప్ చూపిన దారిలో వెళ్లి ముగ్గురు మృతి
X
గూగుల్ మాతను అడిగితే ఏదైనా నిమిషాల్లో చెప్పేస్తుంది. అడ్రస్ కూడా అంతే అనుకున్నారు.. అది చూపించిన దారిలో వెళ్లారు. ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

టెక్నాలజీ మీద ఆధాపడడం ఎక్కువైపోయింది. అడ్రస్ అడగడం లేదు, చెప్పడం లేదు, లొకేషన్ షేర్ చేయండి. జీపీఎస్ ఉందిగా వచ్చేస్తాం అనేవాళ్లే ఎక్కువయ్యారు. కానీ అది కూడా ఒక్కోసారి తప్పుగా చూపించి ముప్పు తిప్పలు పెడుతుంది. ఈసారి ఏకంగా ప్రాణాలే కోల్పోయారు యూపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు.

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో తమ కారును నిర్మాణంలో ఉన్న వంతెనపైకి వారి గూగుల్ మ్యాప్స్ తప్పుగా తీసుకెళ్లడంతో వాహనం నదిలో పడి ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు.

వివేక్, అమిత్ వివాహానికి హాజరయ్యేందుకు గురుగ్రామ్ నుండి బరేలీకి శనివారం కారులో వెళుతున్నారు. జీపీఎస్ మీద ఆధారపడడంతో అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్‌ పైకి తీసుకెళ్లింది. కారు బ్రిడ్జిపై ప్రయాణిస్తూ 50 అడుగుల ఎత్తు నుంచి రామగంగ నదిలో పడిపోయింది. స్థానికులు మరుసటి రోజు ఉదయం కారు నదిలో పడి ఉండడాన్ని గుర్తించారు. ధ్వంసమైన కారును మరియు చనిపోయిన ముగ్గురు వ్యక్తులను కనుగొన్నారు. వారు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

"ఈరోజు ఉదయం 9:30 గంటలకు, రామగంగా నదిలో ధ్వంసమైన కారు కనిపించింది. ఈ ఘటనకు సంబంధిత అధికారులే కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ, వంతెన నిర్మాణం ఎందుకు అసంపూర్తిగా ఉందని, నిర్మాణానికి ఒక చివర బారికేడ్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.

నిర్లక్ష్యానికి పాల్పడిన నిర్మాణ శాఖపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరారు.

Tags

Next Story