Viveka Murder Case: తండ్రీకొడుకును కలిపి విచారించనున్న సీబీఐ

Viveka  Murder Case: తండ్రీకొడుకును కలిపి విచారించనున్న సీబీఐ
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఆసక్తి రేపుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చారు

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఆసక్తి రేపుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చారు. ఇవాళ్టి నుండి ఈనెల 25 వరకు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కోనున్నారు. ఐతే.. ఈసారి అధికారులు తండ్రీకొడుకును కలిపి విచారించనున్నారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను కలిపి విచారణ చేయనున్నారు.

విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డ్ చేయనున్నారు. ఐదవసారి సీబీఐ విచారణకు హాజరవుతున్న అవినాష్ రెడ్డి.. ఐఓ వికాస్ సింగ్ నేతృత్వంలో మొదటి సారి విచారణ ఎదుర్కోనున్నారు. అటు.. సీబీఐ అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. జైలులో ఉన్న వైఎస్ భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌కుమార్‌ రెడ్డిని కస్టడీలోకి తీసుకోనున్నారు.

అవినాష్ రెడ్డి.. భాస్కర్‌ రెడ్డి.. ఈ తండ్రీకొడుకును కలిపి విచారించనుండడం ఆసక్తి రేపుతోంది. ఒకరి కంటే ఎక్కువ మంది నిందితులను విచారించేటప్పుడు.. వేర్వేరుగా.. కలిపి కూడా ప్రశ్నించే విధానం ఉంది. నిందితులు చెప్పేదానిలో నిజం ఎంతో అధికారుల క్రాస్ చెక్‌ చేసుకోనున్నారు. ఒకరు చెప్పినదాన్ని ఇంకొకరి జవాబులతో సరిపోల్చుకోనున్నారు. ప్రధానంగా వివేకా హత్యతో ఉన్న సంబంధాలు, దానికి దారి తీసిన పరిస్థితులపైనే.. అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డిని ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. హత్యకు కుట్ర పన్నడంతోపాటు ఆధారాలు చెరిపేశారని..

గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేశారనేది వీరిపై ఉన్న ప్రధాన అభియోగం. ఇప్పటికే సీబీఐ అనేక కీలకాధారాలు సేకరించింది. గూగుల్‌ టేకౌట్‌ ద్వారా హత్య జరిగిన రోజు నిందితులు ఎక్కడెక్కడ ఉన్నారు.. ఏ సమయంలో ఉన్నారన్నది సీబీఐ సేకరించింది. ఆ సమయంలో వారు అక్కడ ఎందుకున్నారో చెప్పాల్సిన పరిస్థితి నిందితులపై ఉంది.

Tags

Next Story