సద్గురు స్త్రీలను సన్యాసిలా జీవించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు.. ప్రశ్నించిన కోర్టు
ఆధ్యాత్మిక గురు సద్గురు జగ్గీ వాసుదేవ్ తన సొంత కుమార్తె వివాహం చేసుకున్నప్పుడు లేని అభ్యంతరం, ఇతర యువతులను వారి జుట్టును కత్తిరించమని , ప్రాపంచిక జీవితాలను త్యజించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది.
బాగా చదువుకున్న తన ఇద్దరు కూతుళ్లను ఈశా యోగా కేంద్రంలో శాశ్వతంగా ఉండేలా "బ్రెయిన్‌వాష్" చేశారని రిటైర్డ్ ప్రొఫెసర్ ఆరోపించడంతో జస్టిస్‌లు ఎస్‌ఎం సుబ్రమణ్యం, వి శివజ్ఞానంతో కూడిన ధర్మాసనం ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడిని ప్రశ్నించింది.
కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బోధించే ఎస్ కామరాజ్ తన కుమార్తెలను వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపరచాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
సోమవారం కోర్టుకు హాజరైన 42, 39 ఏళ్ల ఇద్దరు మహిళలు తమ ఇష్టానుసారం ఇషా ఫౌండేషన్‌లో ఉంటున్నామని చెప్పారు. అయితే ఈ కేసును మరింతగా విచారించాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. ఇషా ఫౌండేషన్‌కు సంబంధించిన అన్ని కేసుల జాబితాను రూపొందించాలని పోలీసులను ఆదేశించారు.
తన కూతురికి పెళ్లి చేసి జీవితంలో స్థిరపడేలా చేసిన వ్యక్తి ఇతరుల కూతుళ్లను సన్యాసి జీవితాన్ని స్వీకరించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడో తెలుసుకోవాలని జస్టిస్ శివజ్ఞానం అన్నారు.
మహిళలు స్వచ్ఛందంగా తమతో ఉండేందుకు నిర్ణయం తీసుకుంటున్నారని ఇషా ఫౌండేషన్ పేర్కొంది.బసద్గురు స్త్రీలను సన్యాసిలా జీవించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది.
"వయోజన వ్యక్తులు తమ మార్గాలను ఎంచుకునే స్వేచ్ఛ, జ్ఞానం కలిగి ఉంటారని మేము నమ్ముతున్నాము. మేము వివాహం లేదా సన్యాసం విధించడం లేదు, ఇవి వ్యక్తిగత ఎంపికలు. ఈశా యోగా కేంద్రంలో సన్యాసులు కాని వేలమందికి, సన్యాసాన్ని స్వీకరించిన కొద్దిమందికి వసతి కల్పిస్తుంది. ," అన్నారు వారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com