మోమోస్ తిని మహిళ మృతి.. మరో 50 మంది ఆస్పత్రి పాలు

మోమోస్ తిని మహిళ మృతి.. మరో 50 మంది ఆస్పత్రి పాలు
X
బయటి ఫుడ్ అంటేనే భయపడిపోతున్నారు.. అపరిశుభ్ర వాతావరణంలో, అవుట్ డేటెడ్ ప్రోడక్ట్స్ తో తయారు చేసిన పదార్ధాలు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి.

బేకరీ ఫుడ్ భలే టేస్టీగా ఉంటుంది. అందుకే యువత కెఫేల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు. తమకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేస్తే నిమిషాల్లో వేడివేడిగా వడ్డించేస్తారు. ఈ క్రమంలోనే మోమోస్ తిన్న కొంతమంది బాధితులు సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు, అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, మోమోలు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

రేష్మా బేగం (31) అనే మహిళ శుక్రవారం ఒక స్టాల్‌లో మోమోస్ తిన్నానని ఆ తరువాత కడుపు బాలేదని ఫిర్యాదు చేసింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో రోడ్డు పక్కన ఉన్న స్టాల్ లో శుక్రవారం భోజనం చేసి దాదాపు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం స్టాల్ యాజమాన్యంతో పాటు ఆహారం తయారు చేసి వడ్డించిన వ్యక్తిపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రేష్మా బేగం మృతితో పోలీసులు మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ అధికారులు స్టాల్ ను సందర్శించి ఆహార నమూనాలను సేకరించారు. ఆ స్టాల్ ని అధికారులు సీల్ చేశారు

Tags

Next Story