Arthritis Pain: కొన్ని సహజపద్దతుల ద్వారా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం..

Arthritis Pain: కొన్ని సహజపద్దతుల ద్వారా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం..
Arthritis Pain: ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు తమ కీళ్ల నొప్పులకు మందుల ఖర్చు లేకుండా చికిత్స చేయాలని కోరుకుంటారు.

Arthritis Pain: ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు తమ కీళ్ల నొప్పులకు మందుల ఖర్చు లేకుండా చికిత్స చేయాలని కోరుకుంటారు. నొప్పిని తగ్గించడానికి, రోజువారీ జీవితాన్ని మెరుగుపరచడానికి అనేక సహజ మార్గాలు ఉన్నాయి. ఈ విధానాలు మీకు తప్పక ఉపశమనాన్ని కలిగిస్తాయి.. ప్రయత్నించి చూడండి.

1. కదలండి

వ్యాయామం కీళ్ల నొప్పిని తగ్గిస్తుంది. ఎందుకంటే ఇది కీళ్లకు మద్దతు ఇచ్చే కండరాలను బలపరుస్తుంది. నొప్పిని తగ్గించే ఎండార్ఫిన్‌లను ఉత్పత్తి చేయడానికి శరీరాన్ని ప్రేరేపిస్తుంది. మీరు ఏ రకమైన వ్యాయామం చేస్తారు అనేది మీ ప్రస్తుత ఫిట్‌నెస్ స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. నడక, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు మంచివి.

2. ఎక్కువ ఫైబర్ తినండి

పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునే వారికి ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పి తక్కువగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునే వ్యక్తులు తక్కువ ఆమ్లాలను ఉత్పత్తి చేస్తారు. ఇది జీర్ణవ్యవస్థలోని ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల సమతుల్యతను పెంపొందించడంలో సహాయపడుతుంది. .

3. వేడి కాపడం

కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారికి వేడి నీటి కాపడం ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది గట్టిగా ఉన్న జాయింట్‌లను వదులు చేస్తుంది. హీట్ ప్యాక్ తీసుకుని నొప్పులు ఉన్న చోట పెట్టుకోవాలి.

4. లేదా కూల్ ప్యాక్

కీళ్ల వాపులు కీళ్ల నొప్పులకు దారితీస్తాయి. కీళ్ల జాయింట్‌పై కోల్డ్ కంప్రెసర్ ను ఉంచడం వల్ల నొప్పి, మంట తగ్గుతుంది.

5. సంబంధాలను పెంపొందించుకోండి

సోషల్ నెట్‌వర్క్‌లను కలిగి ఉన్న ఉన్న వ్యక్తులు వారి నొప్పిపై ఫోకస్ పెట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. తమ రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుందని బాధపడే అవకాశం తక్కువగా ఉంటుంది. దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్లి మీ తోటి వారితో మాట్లాడడం, ఇరుగు, పొరుగుతో స్నేహ బాంధవ్యాన్ని పెంపొందించుకోవడం చేయాలి.

6. సాగదీయండి

మీ శరీరంలో కదలికలు లేకపోతే నొప్పి మరింత తీవ్రంగా ఉంటుంది. సున్నితమైన కదలిక నొప్పిని దూరంగా ఉంచుతుంది. మీ డాక్టర్ లేదా ఫిజియో థెరపిస్ట్ మీ పరిస్థితికి తగిన వ్యాయామాలు సూచిస్తే అవి చేయండి.

7. పసుపు

పసుపు గొప్ప రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపులో ఉన్న కర్కుమిన్ కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

8. మంచి నిద్ర అలవాట్లను పాటించండి

నొప్పిని నివారించడానికి తగినంత నిద్ర చాలా ముఖ్యం. ఉదాహరణకు, మీ పడకగదిని నిశ్శబ్దంగా, చీకటిగా ఉండేలా చేయండి. ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోండి.

9. ధ్యానం చేయండి

ధ్యానం అనేది విశ్రాంతి తీసుకోవడానికి సులభమైన మార్గం. ఎక్కడైనా సౌకర్యవంతంగా కూర్చోవడమో లేదా పడుకోవడమో చేసి కళ్ళు మూసుకోవాలి. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అనేక ఫోన్ యాప్‌లు, ఆన్‌లైన్ వీడియోలు గైడెడ్ మెడిటేషన్‌ను అందిస్తున్నాయి.. అవి కూడా ప్రయత్నించొచ్చు.

ప్రతి సెషన్‌కు కొన్ని నిమిషాల ధ్యానంతో ప్రారంభించండి. మీరు క్రమంగా మీ రోజువారీ ధ్యాన సమయాన్ని 10, 20 లేదా 30 నిమిషాలకు పెంచుకోవచ్చు.

10. ఆక్యుపంక్చర్ ప్రయత్నించండి

ఈ పురాతన చైనీస్ హీలింగ్ టెక్నిక్ కొందరు వ్యక్తులకు తమ దీర్ఘకాలిక నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి.

11. మసాజ్

మసాజ్ మీ గట్టిపడిన కీళ్ల కండరాలను వదులు చేస్తుంది. దాంతో ఆయా భాగాల్లో మీ రక్త ప్రవాహం సులువుగా జరుగుతుంది. మసాజ్ మీ మనస్సును కూడా ప్రశాంతపరుస్తుంది.

కీళ్ల నొప్పులకు వైద్యుని పర్యవేక్షణలో మందులు వాడుతున్నా పై పద్దతులను అవలంభించవచ్చు. ఇవేమీ శరీరానికి హాని చేసేవి కావు.. అన్నీ సహజపద్దతులు.. మీకు సౌకర్యంగా అనిపించినవే ఎన్నుకుని పాటించండి.. నొప్పుల నుంచి ఉపశమనం పొందండి.

Tags

Read MoreRead Less
Next Story