మైక్రోవేవ్‌లో మళ్లీ వేడి చేస్తున్నారా.. 5 ఆహారాలు అస్సలు..

బిజీలైఫ్.. వంటగదిలో ఎన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటే అంత త్వరగా పని పూర్తవుతుంది.. ఆధునిక మహిళ అన్నింటిలో తన ప్రతిభ కనబరచాలనుకుంటుంది.. తన కోసం కొంత సమయం కేటాయించుకోవాలనుకుంటున్నారు. అందుకు త్వరగా పనైపోయే ఉపకరణాలు చాలా అవసరం.. వంటగదిలో అత్యంత ఉపయోగకరమైన ఉపకరణాలలో మైక్రోవేవ్ ఓవెన్ ఒకటి. అయితే అందులో కొన్ని ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేయడం వల్ల విషపూరితం అవుతాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిల్వ చేసిన ఆహారంలోని బ్యాక్టీరియా ప్రోటీన్లను తగ్గిస్తుంది. ఆహారం యొక్క పోషక విలువలు తగ్గిపోతాయి. ఇది ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలకు కూడా దారి తీస్తుంది. మైక్రోవేవ్‌లో మళ్లీ వేడి చేయకూడని కొన్ని ఆహార పదార్థాల జాబితా..
1. బియ్యం: రైస్‌లో బాసిల్లస్ సెరియస్ బీజాంశం ఉంటుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే బాక్టీరియా. ఓవెన్‌లో అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల ఇందులోని బ్యాక్టీరియా అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది.
2. ఉడికించిన గుడ్లు: ఓవెన్‌లో ఉడికించిన గుడ్లను మళ్లీ వేడి చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే క్యాన్సర్ కారక విషపదార్థాలు విడుదలవుతాయి.
3. కాఫీ: మైక్రోవేవ్ ఓవెన్‌లో కాఫీని మళ్లీ వేడి చేయడం దాదాపుగా అందరూ చేస్తుంటారు. ఈ విషయం తెలిస్తే ఆ పని అస్సలు చేయరు. ఎందుకంటే కాఫీ చల్లబడినప్పుడు ఆమ్లంగా మారుతుంది. ఇది గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది. దానికంటే కాఫీని థర్మో-ఫ్లాస్క్‌లో నిల్వ చేయండి. నచ్చినప్పుడు సిప్ చేయండి.
4. చికెన్: ఓవెన్ ఆహారాన్ని సమానంగా వేడి చేయడంలో విఫలమవుతుంది. చికెన్ లోపల ఉడక్కపోతే కడుపు నొప్పి వస్తుంది.
5. చేప: మైక్రోవేవ్ తేమను గ్రహిస్తుంది. అంటే చేపలను మళ్లీ వేడి చేయడం వల్ల దాని మృదుత్వం మొత్తం పోయి పొడిగా మారుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com